అమెరికాలో ఆగర్భ శ్రీమంతుడైన థామస్ లీ ఆత్మహత్య చేసుకుని అర్ధాంతరంగా తనువు చాలించటం సంచలనం సృష్టిస్తోంది. ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ లో రారాజుగా పేరుగాంచిన థామస్ లీ తన ఆఫీసులోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. 78 ఏళ్ల వయసులో మన్హట్టన్ లోని తన ఆఫీసులో ఈయన ఆత్మహత్య చేసుకున్నారు.
- Advertisement -
తుపాకితో కాల్పుచుకుని ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. బాత్రూములో ఉన్న థామస్ ఎంతకీ బయటికి రాకపోవటంతో ఆయన అసిస్టెంట్ ఉద్యోగినికి అనుమానం వచ్చింది. ఆతరువాత చూస్తే ఆయన గన్ తో కాల్చుకుని చనిపోయినట్టు పోలీసులు గుర్తుంచారు.
46 ఏళ్లుగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ గా ఆయన చరిత్ర సృష్టించారు. లివరేజ్డ్ బై అవుట్ గా ప్రసిద్ధిగాంచిన విధానాన్ని మొట్టమొదట ఉపయోగించినదే ఈయన.