భారత్- పాకిస్థాన్(India-Pakistan) దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ భారత్‌పై దాడులను ఉద్రిక్తతం చేసింది. దీంతో భారత బలగాలు పాక్ దాడులను బలంగా తిప్పికొడుతున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(Jd Vance) స్పందించారు. ఈ యుద్ధంలో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు.
అయితే అమెరికా ప్రభుత్వం భారత్-పాక్ ఉద్రిక్తతల గురించి ఆందోళన చెందుతోందని తెలిపారు. ఈ ఉద్రిక్తతలు వీలైనంత త్వరగా తగ్గాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. దౌత్యపరమైన మార్గాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించడమే ఏకైక మార్గం అని వాన్స్ వెల్లడించారు. కాగా ఇటీవల జేడీ వాన్స్ తన కుటుంబంతో కలిసి భారత పర్యటనకు వచ్చిన సమయంలోనే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే.