America Visa issuance suspended for 75 countries: అగ్రరాజ్యం అమెరికా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 75 దేశాల పౌరులకు జనవరి 21 నుండి వీసా ప్రాసెసింగ్ మొత్తాన్ని నిలిపివేస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత చట్టం ప్రకారం, వీసాలను తిరస్కరించాలని కాన్సులేట్ అధికారులకు అమెరికా విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వీసా జారీ నిలిపివేసిన దేశాల్లో రష్యా, బ్రెజిల్, థాయిలాండ్, యెమెన్, ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు ఇరాన్ కూడా ఉండటంతో ఆయా దేశాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే, ఇరాన్, రష్యా, సోమాలియా లాంటి దేశాల పౌరులకు అమెరికా వీసా జారీ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ బ్రెజిల్ లాంటి దేశానికి సైతం వీసాలు జారీ చేయడాన్ని నిలివేయడం ఇప్పుడు షాకింగ్‌గా మారింది. వలసలను నియంత్రించడం కోసమే ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ట్రంప్ నిర్ణయాన్ని బట్టి తెలుస్తోంది. అయితే, తాత్కాలికంగానే వీసాల జారీని నియంత్రించిన ఈ సమయంలో డిపార్ట్‌మెంట్ స్క్రీనింగ్, వెట్టింగ్ విధానాల్లో కొన్ని మార్పులు తీసుకురానున్నట్లు తెలుస్తుంది.

