Balendra Shah: నేపాల్‌లో ప్రస్తుతం జరుగుతున్న సోషల్ మీడియా నిషేధం ఉద్యమం కాస్త చిలికి చిలికి అక్కడి ప్రభుత్వాన్నే కూల్చేసింది. కేవలం గంటల వ్యవధిలోనే యూత్ అక్కడి మంత్రులను మాజీలుగా మార్చేశారు. అచ్చం బంగ్లాదేశ్, శ్రీలంక మాదిరిగానే ప్రస్తుతం నేపాలీలు అక్కడి న్యాయస్థానాలు, రాజకీయ నాయకుల భవనాలను టార్గెట్ చేస్తూ నిప్పంటిస్తున్నారు. దీంతో జనజీవితంలో ఉద్రిక్తత పెరిగింది. ముఖ్యంగా బ్యాన్ వెనక్కి తీసుకున్నప్పటికీ.. Gen Z పోరగాళ్లు పెద్ద హింసాత్మక నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నిరసనలు ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి పాలనపై తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఇప్పటికే 19 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. మధ్యతరగతి యువత రాజకీయ వ్యవస్థను సవాలు చేస్తూ, కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.
ఈ క్రమంలోనే బాలేంద్ర షా అనే వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అతనే తమ కొత్త ప్రధానిగా రావాలంటూ యూత్ కోరుకుంటోంది నేపాల్ లో. వాస్తవానికి బాలెన్ ఒక రాపర్‌గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. తర్వాత సివిల్ ఇంజనీర్‌గా మారి ఇప్పుడు కాథ్మండూ మెట్రో పోలిటన్ సిటీ మేయర్‌గా పనిచేస్తున్నాడు. 2022లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ఆ స్థానాన్ని జయించాడు. అతని నాయకత్వ శైలి, కొత్తతరం ఆలోచనలు నేపాల్ కుర్రోళ్లను బాగా ఆకట్టుకుంది.
బాలేంద్ర షా ముఖ్యమైన అంశాల మీద దృష్టి పెట్టాడు. ఉదాహరణకు చుట్టూ ఉన్న ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలను తగ్గించడం, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, ఉపయోగం లేని నిర్మాణాలను నిర్మూలించడం వంటివి చేపట్టాడు. ప్రస్తుతం జెన్ జెడ్ ఉద్యమం ఆధ్వర్యంలో జరుగుతున్న సోషల్ మీడియా నిషేధ నిరసనలకు బెలెన్ ఒక ముఖ్య మద్దతుదారు. అతను ఈ ఉద్యమాన్ని తన ఫేస్‌బుక్ పోస్టులతో మద్దతిచ్చాడు. నేపాల్ ప్రభుత్వం యువతకు స్వేచ్ఛను హరించేలా వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించాడు.
ప్రస్తుతం ఓలీ ప్రభుత్వంపై బెలెన్ విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన ప్రైమ్ మినిస్టర్ ఓలిని “టెర్రరిస్త్” అని అభియోగం చేసిన విషయం, ఉద్యమంలో మరణించిన విద్యార్థుల కుటుంబాల బాధను అర్థం చేసుకోలేకపోయిన విధానాన్ని ఖండించడం గొప్ప ఉద్యమ స్ఫూర్తిని రేకెత్తించింది. దీంతో అతడు జెన్ జెడ్ ఆశయాలకు ప్రతీకగా నిలిచారు. యువత నుంచి దృఢమైన మద్దతు, ప్రజల్లో మరింత పాపులారిటీని అతని తీరు పెంచేసింది. ప్రస్తుతం ఆయన ప్రజలను ఏకం చేసి కొత్త రాజకీయ మార్పుల కోసం ముందువచ్చే ఉద్దేశ్యంతో ఉన్నాడు. ఈ ఊహాగానంలో జెన్ జెడ్ యువత అతన్ని వారి కొత్త ప్రధాని నిర్మాణంగా భావిస్తున్నారు.
ఈ పరిస్థితులు మొత్తంగా నేపాల్ రాజకీయాల్లో కొత్త దశను సూచిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. సోషల్ మీడియా నిషేధం వివాదం ప్రారంభమైన తర్వాత 19 మంది విద్యార్థుల ప్రాణాలు పోయిన ఉద్రిక్తతల మధ్య, జెన్ జెడ్ యువతకు బెలెన్ ను కొత్త భవిష్యత్తుగా నాయకత్వం వహించే మార్గదర్శిగా.. పాత రాజకీయ వ్యవస్థలను మార్చే రాజకీయ శక్తిగా భావిస్తున్నారు.


