Tuesday, December 3, 2024
Homeఇంటర్నేషనల్Biggest Gold Fish : ప్రపంచంలోనే భారీ గోల్డ్ ఫిష్.. బరువు ఎంతో తెలుసా

Biggest Gold Fish : ప్రపంచంలోనే భారీ గోల్డ్ ఫిష్.. బరువు ఎంతో తెలుసా

గోల్డ్ ఫిష్.. అనగానే మనకు గుర్తొచ్చేది అక్వేరియం. ఒక గాజు నీటి తొట్టెలో చిన్న చిన్నగా.. బుజ్జి బుజ్జిగా ఉండే చేపలు అటూ ఇటూ తిరుగుతుంటే చూడముచ్చటగా ఉంటుంది కదూ. అక్వేరియంలో ఉండే గోల్డ్ ఫిష్ ల బరువు కనీసం ఒక కేజీ కూడా ఉండదు. కానీ.. బ్రిటీష్ కు చెందిన ఓ వ్యక్తికి మాత్రం భారీ గోల్డ్ షిఫ్ చేజిక్కింది. దాని బరువెంతో తెలుసా.. ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా 31 కిలోలు. బంగారం రంగులో మెరిసిపోయే ఆ గోల్డ్ ఫిష్ ప్రపంచంలోనే అత్యంత భారీ గోల్డ్ ఫిష్ గా రికార్డు క్రియేట్ చేసింది.

- Advertisement -

బ్రిటీష్ మ‌త్స్య‌కారుడు ఆండీ హాకెట్ సుమారు 31 కేజీల గోల్డ్‌ఫిష్‌ను ప‌ట్టుకున్నాడు. ఇది ప్ర‌పంచంలోనే అత్యంత బ‌రువైన గోల్డ్‌ఫిష్ చేప‌గా రికార్డైంది. గతంలో అమెరికాలోని మిన్నసొట్టాలో దొరికిన గోల్డ్ ఫిష్ రికార్డును చెరిపేసింది. అంతేకాదు.. ఆ చేపకు ద క్యారెట్ అని పేరు కూడా పెట్టారు. బ్రిటీష్ మ‌త్స్య‌కారుడు ఆండీ హాకెట్ ఈ భారీ గోల్డ్ ఫిష్ ను పట్టుకున్నాడు. ఫ్రాన్స్‌లోని చాంపేన్‌లో ఉన్న బ్లూవాట‌ర్ స‌ర‌స్సులో ఆండీ వ‌ల‌కు ఈ చేప చిక్కింది. లెద‌ర్ కార్ప్‌, కోయి కార్ప్ కు చెందిన హైబ్రిడ్ ర‌క‌మే ఈ భారీ చేప.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News