Thursday, July 4, 2024
Homeఇంటర్నేషనల్Afghanistan: తాలిబన్ల మరో సంచలన నిర్ణయం.. మహిళల చదువుపై మరో నిషేధం

Afghanistan: తాలిబన్ల మరో సంచలన నిర్ణయం.. మహిళల చదువుపై మరో నిషేధం

Afghanistan: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచక పాలన సాగుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది అక్కడ అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచి తాలిబన్లు మహిళలపై విపరీతమైన ఆంక్షలు విధిస్తున్నారు. కొంతకాలం క్రితమే మహిళలకు జిమ్, పార్కులు, అమ్యూజ్‌మెంట్ సెంటర్స్‌లోకి నిషేధం విధించారు. బాలికల చదువు విషయంలోనూ ఆంక్షలు పెట్టారు.

- Advertisement -

ఆడపిల్లలు మగ తోడు లేకుండా బయటకు రాకూడదు. ఇలాంటి వింత ఆంక్షలతో విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ తాలిబన్లు తగ్గడం లేదు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు యూనివర్సిటీ విద్యపై నిషేధం విధించారు. దీని ప్రకారం ఇకపై మహిళలు యూనివర్సిటీల్లో చదువుకోవడం కుదరదు. ఈ మేరకు అక్కడి ఉన్నత విద్యా శాఖ ప్రైవేటు, ప్రభుత్వ యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. గతంలో తాలిబన్లు అఫ్గాన్‌లో అధికారం చేపట్టినప్పుడు అనేక ప్రకటనలు చేశారు.

కొత్త తరహా, ఆధునిక పాలన అందిస్తామని ప్రకటించారు. ప్రపంచ దేశాల తీరుకు అనుగుణంగా మహిళల హక్కుల్ని గౌరవిస్తామని, వారి విద్యకు సహకరిస్తామని ప్రకటించారు. అయితే, అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఈ హామీలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఇస్లామిక్ చట్టాల పేరుతో మహిళలపై తీవ్ర వివక్ష చూపిస్తున్నారు. అమ్మాయిలకు హైస్కూల్, కాలేజ్ ఎడ్యుకేషన్‌ను రద్దు చేశారు. అనేక రంగాల నుంచి మహిళా ఉద్యోగుల్ని తొలగించారు. పబ్లిక్ ప్లేసుల్లో తల నుంచి కాళ్లు కూడా కనిపించకుండా వస్త్రాలు ధరించాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News