Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్America: హిందూ ఆలయాలపై ఆగని దాడులు..!

America: హిందూ ఆలయాలపై ఆగని దాడులు..!

Hindu Temple: అమెరికాలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు ఆగడం లేదు. ఇండియానా రాష్ట్రంలోని జాన్సన్ కౌంటీలో ఉన్న ప్రముఖ హిందూ ప్రార్థనా స్థలం అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ (BAPS) ఆలయంపై వేర్పాటువాదులు దాడికి పాల్పడ్డారు.

- Advertisement -

ఈ ఘటనను హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) ‘ఎక్స్‌’ లో వెల్లడించింది. ఆలయ గోడలపై ఖలిస్థాన్‌కు మద్దతుగా, భారత్‌కు వ్యతిరేకంగా అనేక ద్వేషపూరిత నినాదాలు రాశారు. ఈ చర్య హిందూ సమాజం మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది.

Read more: https://teluguprabha.net/international-news/ishaq-dar-comments-on-kashmir-pakistan-independence-day-2025/

ఈ దాడి 2025లో అమెరికాలో హిందూ ఆలయంపై జరిగిన నాలుగవ ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది. గతంలోనూ కాలిఫోర్నియా, న్యూయార్క్, టెక్సాస్ రాష్ట్రాల్లో హిందూ దేవాలయాలపై ఇలాంటి విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. ఈ దాడుల్లో ఖలిస్థాన్ వేర్పాటువాదుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్థానిక పోలీసులు ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ప్రకటించారు. ఈ దాడి వెనుక భారత వ్యతిరేక శక్తుల హస్తం ఉందా? అనే కోణంలో దర్యాప్తు సాగుతున్నదన్నారు. ఇండియాలోని భారత కాన్సులేట్ జనరల్, చికాగో ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అమెరికా అధికారులను కోరింది.

Read more: https://teluguprabha.net/international-news/british-army-kenya-misconduct-scandal/

BAPS ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ.. ఇటువంటి దాడులు భక్తుల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి ఘటనలు జరగకుండా ఆలయ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలి” అని విజ్ఞప్తి చేశారు. అలాగే, హిందూ అమెరికన్ ఫౌండేషన్, ఉత్తర అమెరికా హిందువుల కూటమి వంటి హిందూ సంఘాలు ఈ దాడులను హేట్ క్రైమ్ గా పరిగణించాలని, విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

అమెరికాలో హిందువులపై పెరుగుతున్న ముప్పు, ఆలయాలపై నిరంతర దాడులు అమెరికాలోని మైనారిటీ హిందూ సమాజంలో భయం కలిగిస్తున్నాయి. మతాల మధ్య సామరస్యాన్ని కలిగించే విధంగా చర్యలు తక్షణమే తీసుకోవాలని మత నాయకులు, కమ్యూనిటీ సంస్థలు అమెరికా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad