Nobel Prize in Different Categories: ప్రపంచవ్యాప్తంగా నోబెల్ పురస్కారాల పండుగ అట్టహాసంగా జరుగుతోంది. ప్రతి యేటా నిర్వహించే ఈ ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతుల వేడుకలో.. వివిధ రంగాల విశేష రంగాల్లో కృషి చేసిన వారిని గౌరవంగా సత్కరించుకుంటారు. 1901లో మొదలైన ఈ సంప్రదాయం ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగుతోంది.
డిసెంబర్ 10న అట్టహాసంగా
భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, వైద్య శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు, ప్రపంచ శాంతికి కృషిచేసిన సామాజికవేత్తలకు ప్రతియేటా ప్రదానం చేస్తుంటారు. ఈ పురస్కారాలను వ్యాపారవేత్త, డైనమైట్‌ను కనుగొన్న ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ప్రారంభించారు. విజేతలను వివిధ సంస్థల నుంచి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలు నిర్ణయిస్తాయి. ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి డిసెంబర్ 10న విజేతలకు నోబెల్ ప్రైజ్‌ను బహుకరిస్తారు.
అయితే ఈ నోబెల్ బహుమతిలో ఏముంటుంది? ఎందుకు ఇంత ప్రత్యేకం. విజేతలందరికీ ఇచ్చే పతకం ఒకేలా ఉంటుందా? అనే సందేహాలు అందరికీ వచ్చే ఉంటాయి. అయితే నోబెల్ ప్రైజ్ విజేతలకు ఒక బంగారు పతకం, ఒక పత్రం, నగదు పురస్కారం ప్రదానం చేస్తారు. ప్రైజ్ మనీ అయితే ఒకేలా ఉంటుంది. కానీ ఆయా రంగాలను బట్టి విజేతలకు ఇచ్చే పత్రం, బంగారు పతకంలో మార్పులు ఉంటాయి.
Also Read: https://teluguprabha.net/international-news/nobel-peace-prize-2025-winner-maria-corina-machado/
నోబెల్ ప్రైజ్‌లో ఇచ్చే బంగారం పతకాన్ని స్వచ్ఛమైన 24 క్యారెట్ల గోల్డ్‌తో తయారు చేస్తారు. పతకం ముందు భాగంలో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ ముఖ చిత్రం తప్పకుండా ఉంటుంది. అన్ని రంగాల విజేతలకు ఇదే మాదిరిగా ఉంటుండగా.. ఆయా అకాడమీలు ఇచ్చే దాన్ని బట్టి కొన్ని మార్పులు ఉంటాయి. పతకం వెనుక భాగంలో రంగాల వారీగా ప్రత్యేకమైన గుర్తులు లేదా కళాకృతులను కలిగి ఉంటాయి.
ఒక్కో రంగానికి ఒక్కో చిహ్నం
ప్రతి బహుమతిని ఇచ్చే అకాడమీ ఆ రంగానికి చెందిన ప్రత్యేక చిహ్నాన్ని పతకంపై రూపొందిస్తుంది. సాహిత్య పతకంపై ఒక ప్రత్యేక చిత్రం ఉంటే, భౌతిక శాస్త్ర పతకంపై సైన్స్ పురోగతిని సూచించే చిత్రాన్ని కలిగి ఉంటుంది. అయితే శాంతి బహుమతి పతకంపై మాత్రం ఆల్‌ఫ్రెడ్ నోబెల్ చిత్రం ఉండదు. బదులుగా నార్వేజియన్ నోబెల్ కమిటీ పేరు ఉంటుంది.
విజేత కృషి
ఇక ప్రశంసా పత్రంపై విజేత చేసిన కృషిని వివరిస్తారు. కళాకారుల చేత ఎంతో ప్రత్యేకంగా చేతితో డిజైన్ చేయించిన ఈ పత్రం దేనికదే ప్రత్యేకం. ప్రశంసా పత్రం రూపకల్పన, దానిపై వాడే రంగులు, ఆర్ట్ వర్క్.. ప్రతి విభాగానికి, ప్రతి విజేతకు అనుగుణంగా ఉంటాయి.
Also Read: https://teluguprabha.net/telangana-news/vote-without-voter-identity-card-in-jubilee-hills-bypoll/
నగదు పురస్కారం
ఇక నగదు పురస్కారం విషయానికొస్తే.. ఆల్‌ఫ్రెడ్ నోబెల్ ఫౌండేషన్ ఆదాయం బట్టి ఈ పురస్కారం ఉంటుంది. అయితే అన్ని రంగాల వారికి ఒకటే ప్రైజ్ మనీ అందిస్తారు. ఈ క్రమంలో ఒకే రంగంలో ఇద్దరికీ లేదా ముగ్గురికి వస్తే ఆ ప్రైజ్ మనీని వారికి సమానంగా అందిస్తారు.
ప్రదానం చేసే వేదికలు
ఇక నోబెల్ బహుమతులను ప్రదానం చేసే వేదికల విషయానికొస్తే.. నోబెల్ శాంతి బహుమతిను నార్వే దేశంలోని ఓస్లోలో అందిస్తుండగా.. మిగిలిన రంగాల్లో విజేతలకు స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో పురస్కారాలతో సత్కరిస్తారు.


