Azerbaijan: భారత్ పై అజర్ బైజాన్ అక్కసు వెళ్లగక్కింది. పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం వల్లే భారత్ ప్రపంచ వేదికలపై తమను దెబ్బకొట్టిందని అజర్‌బైజాన్ (Azerbaijan) విమర్శించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు సహకారం అందించినందుకే.. షాంఘై సహకార సంస్థ సదస్సు (SCO)లో పూర్తి సభ్యత్వం కోసం తాము చేసిన ప్రయత్నాన్ని భారత్ అడ్డుకుందని పేర్కొంది. ఈ చర్యలు బహుపాక్షిక దౌత్య ఉల్లంఘనలేనని ప్రేలాపనలు పేలింది. అంతర్జాతీయ వేదికలపై తమపై భారత్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ తాము ఇస్లామాబాద్‌తో సంబంధాలు కొనసాగిస్తామని, అది తమ మిత్ర దేశమని అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ (Ilham Aliyev) ప్రగల్భాలు పలికారు. రాజకీయంగా, సాంస్కృతికంగా, వ్యూహాత్మకంగా ఇరుదేశాల మధ్య లోతైన బంధాలు ఉన్నాయని తెలిపారు. చైనాలోని తియాన్‌జిలో ఇటీవల నిర్వహించిన షాంఘై సహకార సంస్థ సదస్సులో అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలీయేవ్ పాల్గొన్నారు. ఈక్రమంలో పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌తో సమావేశమైన ఆయన ఇటీవల భారత్‌తో జరిగిన ఘర్షణల్లో విజయం సాధించారని పేర్కొంటూ.. పాక్ ప్రధానిని అభినందించినట్లు సమాచారం. ఆ దేశంతో ఆర్థిక, వాణిజ్య విషయాల గురించి కూడా చర్చలు జరిపినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
Read also: Modi: జిన్ పింగ్ సన్నిహితుడితో కైక్వీతో భేటీ..!
పహల్గాం ఉగ్రదాడి
పహల్గాంలో పర్యాటకులపై పాక్ ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడులు చేపట్టారు. ఈ దాడి తర్వాత పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు నిర్వహించింది. ఆ సమయంలో అజర్‌బైజాన్ పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతిచ్చింది. దీంతో ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు మద్దతిచ్చిన తుర్కియే, అజర్‌బైజాన్‌లపై మన దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ రెండు దేశాలతో వాణిజ్య, ఇతర సంబంధాలను రద్దు చేసుకుంటున్నట్లు భారత్‌లోని పలు సంస్థలు వెల్లడించాయి.
Read also: Kim Jong Un: ప్రత్యేక రైలులో చైనాకు కిమ్..!


