ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్(Chinmoy Krishna Das)కు ఊరట లభించలేదు. చిట్టాగ్రామ్ మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి మహమ్మద్ సైఫుల్ ఇస్లామ్.. ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. బెయిల్ కోసం 11 మంది లాయర్ల బృందం గట్టిగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లభించలేదు. దీంతో ఈ తీర్పుపై తాము హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లుగా ఆయన తరపు న్యాయవాది అపూర్వ కుమార్ భట్టాచార్జీ తెలిపారు.
కాగా బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్ కృష్ణదాస్ గతేడాది నవంబరులో చిట్టగాంగ్‌లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ బంగ్లా జాతీయజెండాను అగౌరవపరిచారనే అభియోగాలపై 2024 నవంబరు 25న హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అనంతరం జైలుకు తరలించారు.