Sunday, November 16, 2025
Homeఇంటర్నేషనల్Baloch: పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న బలోచ్ ఆర్మీ.. 27 మంది హతం!

Baloch: పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న బలోచ్ ఆర్మీ.. 27 మంది హతం!

Balochistan attack on Pakistan: పాకిస్థాన్ భద్రతా బలగాలపై బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (BLA) దాడుల తీవ్రత పెరిగింది. సంస్థ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, గత రెండు రోజుల్లో 27 మంది పాకిస్థాన్ సైనికులను హతమార్చినట్లు పేర్కొంది. ఈ సంఘటనల వల్ల పాకిస్థాన్ ఆర్మీకి తీవ్ర ఒత్తిడి నెలకొందని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి. BLAకి చెందిన ఫతే స్క్వాడ్, బెలూచిస్తాన్ రాష్ట్రంలోని నిమ్రాగ్‌ క్రాస్ వద్ద సైనికులను తరలిస్తున్న బస్సుపై దాడికి పాల్పడింది. కరాచీ నుంచి క్వెట్టా వెళ్తున్న ఆ బస్సుపై విరుచుకుపడి భారీ నష్టాన్ని కలిగించినట్లు తెలిపింది. ఈ దాడిలో 27 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.

- Advertisement -

ఐఈడీ పేలుళ్లతో మరిన్ని దాడులు

ఇంకా BLA ప్రకారం, క్వెట్టా హజార్‌గంజ్ ప్రాంతంలో జరిపిన మరో దాడిలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఖజినా (కలాత్) ప్రాంతంలో మంగళవారం ఐఈడీ పేల్చి నలుగురు సైనికులను హతమార్చినట్లు తెలిపింది. అదే విధంగా గుజ్రోకొర్ ప్రాంతంలో బుధవారం మరో దాడి చేసి ఆరుగురిని మట్టుబెట్టినట్లు పేర్కొంది. ఈ దాడుల్లో పాక్ ఆర్మీకి చెందిన మేజర్ సయిద్ రబ్ నవాజ్ తరీక్ కూడా మృతి చెందినట్లు BLA వెల్లడించింది.

BLA తెలిపిన వివరాల ప్రకారం, సమీపంలోని సైనిక కాన్వాయ్‌ను టార్గెట్ చేసిన సమయంలో స్నైపర్లు దాడికి దిగారు. కాన్వాయ్ స్థానాన్ని వదిలి వెళ్ళినట్లు పేర్కొంది. ఈ దాడుల్లో తమ మూడు మంది సభ్యులు మరణించారనే వార్తలను BLA ఖండించింది. 2024 ప్రారంభం నుంచి జూన్ నెల వరకు బలోచ్ తిరుగుబాటు దళాలు మొత్తం 286 దాడులకు పాల్పడ్డాయి. ఇందులో మూడు ఆత్మాహుతి దాడులు కూడా ఉన్నాయి. బీఎల్‌ఏ ప్రకారం, ఈ దాడులలో 700 మందికిపైగా చనిపోయారు, 290 మందిని హతమార్చారు. అలాగే 133 వాహనాలు ధ్వంసం చేయడంతోపాటు, ఒక రైలును హైజాక్‌ చేసిన ఘటన కూడా జరిగింది. BLA సమాచారం ప్రకారం, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 45 కీలక ప్రాంతాలను పాకిస్థాన్ అధీనంలో నుంచి స్వాధీనం చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ధారాళమైన దాడుల ధాటికి పాకిస్థాన్ ఆర్మీ తీవ్ర ఒత్తిడిలో ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad