Thursday, November 14, 2024
Homeఇంటర్నేషనల్ISKCON: 'ఇస్కాన్' ఓ టెర్రెరిస్టు సంస్థ: బంగ్లా పోలీసులు

ISKCON: ‘ఇస్కాన్’ ఓ టెర్రెరిస్టు సంస్థ: బంగ్లా పోలీసులు

ISKCON| శ్రీకృష్ణుడిని ఆదరించే స్వచ్ఛంద సంస్థ ‘ఇస్కాన్’ను టెర్రరిస్టు సంస్థ అంటూ బంగ్లాదేశ్ పోలీసులు విమర్శించారు. రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఆ దేశంలో తమకు భద్రత కల్పించాలని హిందూ కమ్యూనిటీ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో వారిని అక్కడి పోలీసులు దారుణంగా అణిచివేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘జై శ్రీరాం’ అని గట్టిగా నినాదం చేసినందుకు ఇస్కాన్ కమ్యూనిటీని టెర్రరిస్టు సంస్థగా బంగ్లా పోలీసులు ప్రెస్ మీట్‌లో తెలిపారు. ఇస్కాన్ ‘రా’ కోసం పనిచేస్తోందని దానిని బ్యాన్ చేయాలని బంగ్లా తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ పేర్కొన్నారు.

- Advertisement -

దీంతో బంగ్లా పోలీసులు, తాత్కాలిక ప్రధాని వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ ప్రభుత్వంపై భారతీయ హిందువులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. బంగ్లాదేశ్‌లో నివసించే హిందువులను కాపాడాలంటూ కోరుతున్నారు. కాగా ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో ఇండియాలో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. అప్పటి నంచి అక్కడి హిందువులు, ఆలయాలపై దాడులు పెరిగిపోయాయి. మహిళలను బహిరంగా వేధించడం వంటి ఘటనలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News