Air China Fire in Passenger’s Luggage: ఇటీవలి కాలంలో తరచూ విమాన ప్రమాదాలు చోటుచేసుకోవడం కలవరం సృష్టిస్తున్నాయి. విమానం గాల్లో ఉండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటనలు చూశాం. ఇంజిన్‌లో ఏర్పడే సాంకేతిక లోపాల కారణంగా ఇలాంటివి తలెత్తుతున్నాయి. అయితే ఈ సారి ఓ ప్రయాణికుడి పొరపాటు కారణంగా చైనాకు చెందిన ఓ విమానంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.
శుక్రవారం చైనాలోని ఎయిర్ చైనా విమానం సీఎ139 టేకాఫ్ అయిన కాసేపటికే ఓ ప్రయాణికుడి లగేజీలో మంటలు చెలరేగిన సంఘటన చోటుచేసుకుంది. హాంగ్జౌ నుంచి దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌కు విమానం బయలుదేరింది. అయితే ఆ కాసేపటికే ఆ విమానంలో ఓ ప్రయాణికుడి లగేజీలోని లిథియం బ్యాటరీ పేలి మంటలు చెలరేగాయి. విమానం లోపల అంతా పొగమయం అయింది. హఠాత్పరిణామానికి ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
విమానం లోపల అంతా పొగమయం కావడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం విమానాన్ని షాంఘైకి మళ్లించడంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. లిథియం బ్యాటరీ పేలడంతో మంటలు ఓవర్‌హెడ్ బిన్ నుంచి బయటకు వచ్చాయి. ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు వచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ఎయిర్ చైనా వెల్లడిచింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Pesawat A320Neo Air China CA403 (🇨🇳) mendarat darurat di bandara Changi, Singapura (🇸🇬), sore hari ini (10SEP23) karena mengalami kebakaran mesin sewaktu descent menjelang mendarat.
📷 1: Foto mesin yang masih terbakar saat evakuasi.
📷 2: Kondisi cabin pesawat saat kejadian.
📹… pic.twitter.com/rhQHwOd1Ib— Gerry Soejatman (@GerryS) September 10, 2023


