తైవాన్ పౌరులు కనీసం ఏడాదిపాటు తప్పకుండా సైన్యంలో చేరి దేశ సేవ చేయాల్సిందే. ఈమేరకు తైవాన్ సర్కారు కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. చైనాతో దాడుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తైవాన్ ప్రజలు ప్రతి ఒక్కరూ సైన్యంలో చేరక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. తైవాన్ ను తమ దేశంలో భాగంగా చైనా భావించటమే ఈ సమస్యకు మూలకారణంగా మారింది. యుద్ధాన్ని ఎవరూ కోరుకోరు కానీ తమ పొరుగు దేశం మాత్రం ఇదే కోరుకుంటుందని, శాంతి అనేది ఆకాశం నుంచి ఊడిపడదంటూ తైవాన్ సర్కారు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం తైవాన్ లో ప్రతి తైవానీ కనీసం 4 నెలల పాటు ఆర్మీ చేరాల్సి ఉండగా అది సరిపోదంటూ చట్టానికి సవరణలు చేసింది. 2005, జనవరి 1 వ తేదీ తరువాత పుట్టిన వారందరికీ ఇది వర్తించనుంది. కాగా ఇలాంటి చట్టాలతో తైవాన్ సర్కారు ప్రజాదరణ కోల్పోయిన నేపథ్యంలో గత సర్కారు ఈ కాలాన్ని ఏడాది నుంచి నాలుగు నెలలకు తగ్గించింది. కానీ తాజాగా ఈ నాలుగు నెలలు ఏమాత్రం సరిపోదని తైవానీ ప్రజలు భావిస్తుండటంతో తాజాగా ఈమేరకు సర్కారు చట్టంలో మార్పులు తేవటం ఆసక్తికరంగా మారింది.
Big move: సైన్యంలో అందరూ చేరాల్సిందే, ఏడాదిపాటు మ్యాండేటరీ మిలిటరీ సర్వీస్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES