HomeTop StoriesDonald Trump: ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. టారిఫ్‌ల పెంపును సమర్థించిన వాషింగ్టన్‌ కోర్టు

Donald Trump: ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. టారిఫ్‌ల పెంపును సమర్థించిన వాషింగ్టన్‌ కోర్టు

Big relief for America President Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రపంచ దేశాల మీద టారీఫ్‌ల మోత మోగించిన సంగతి తెలిసిందే. ఈ టారిఫ్‌ల పెంపుపై వ్యాపార సంస్థలు కోర్టును ఆశ్రయించగా.. తాజాగా, ట్రంప్‌ నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా దిగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్‌ విధించిన 10 శాతం గ్లోబల్‌ టారిఫ్‌లను వాషింగ్టన్‌లోని ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు సమర్థించింది. పెంచిన టారిఫ్‌లను అలాగే కొనసాగించవచ్చని కీలక తీర్పు వెల్లడించింది.

- Advertisement -

Also read: Petrol Diesel Prices: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలివే.. ఎక్కడ ఎంత ఉందంటే?

ట్రంప్‌ నిర్ణయాన్ని సమర్థించిన కోర్టు..

గతేడాది, భారత్‌తో సహా అన్ని దేశాలపై ట్రంప్‌ భారీగా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. వాటిని ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ వెంటనే ట్రేడ్‌ యాక్ట్‌ 1974లోని సెక్షన్‌ 122ను ఉపయోగించి జులై 24 వరకు అమల్లో ఉండేలా 10 శాతం తాత్కాలిక సుంకాలను ట్రంప్‌ విధించారు. రెండు వ్యాపార సంస్థలు ఇటీవల దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. అక్కడ ట్రంప్‌నకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం సుంకాలను నిర్ణయించే అధికారం ఫెడరల్‌ కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని, వైట్‌ హౌస్‌కి ఉండదని న్యూయార్క్‌లోని ఫెడరల్‌ కోర్టు స్పష్టంచేసింది. దీంతో, ట్రంప్‌ యంత్రాంగం ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లగా తాజాగా ఆయనకు ఊరట లభించింది. ట్రంప్‌ నిర్ణయానికి అనుకూలంగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. కాగా, ఈ తీర్పుపై పలు వ్యాపార సంస్థలు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News