Thursday, March 20, 2025
Homeఇంటర్నేషనల్బీజాపుర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 22 మావోయిస్టులు హతం..!

బీజాపుర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 22 మావోయిస్టులు హతం..!

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో గురువారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ కాల్పుల్లో ఒక పోలీసు జవాను కూడా ప్రాణాలు కోల్పోయాడు. బీజాపుర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని దట్టమైన అడవుల్లో ఈ ఘటన జరిగింది.

- Advertisement -

మావోయిస్టుల కదలికల గురించి సమాచారం అందడంతో బీజాపుర్, దంతెవాడ జిల్లాల నుంచి భద్రతా బలగాలు కలిసి ఆ ప్రాంతంలో శోధన చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు పెద్ద దెబ్బ తగిలిందని పోలీసులు చెప్పారు. ఘటనా స్థలంలో చాలా ఆయుధాలు, బాంబులు తయారు చేసే పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

బీజాపుర్ జిల్లాలోని గంగలూరు దగ్గర ఉన్న అడవుల్లో చాలా మంది మావోయిస్టులు ఉన్నారని సమాచారం వచ్చింది. దాంతో భద్రతా బలగాలు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి శోధన మొనలు పెట్టాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతా దళాలు తనిఖీలు చేస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఎన్‌కౌంటర్‌పై పూర్తిగా దర్యాప్తు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. మావోయిస్టుల కదలికలను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వారు స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్య ప్రాంతంలో తరచూ భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతూ ఉంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News