ప్రపంచంలో అపర కుబేరుడు, దానకర్ణుడిగా పేరుగాంచిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ మళ్లీ ప్రేమలో పడ్డారు. అంతర్జాతీయ మీడియా చెప్పేది నిజమైతే ఆయన కొత్త ప్రేయసి పేరు పౌలా హర్డ్. ఇప్పుడు వీళ్లద్దరూ ఓపన్ గానే చట్టాపట్టాలు వేసుకుని తిరిగేస్తున్నారు. అంతేకాదు ఏకంగా గతనెల్లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపన్ టెన్నీస్ టోర్నీకి కలిసి లవ్ బర్డ్స్ లా వెళ్లి అందరికంటా పడ్డారుకూడా.
వీళ్లిద్దరూ సన్నిహతంగా ఉన్న పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. వీళ్లిద్దరికూ టెన్నిస్ అంటే ఇష్టం అందుకే మెల్ బోర్న్ లో జరిగిన మెన్స్ సింగిల్ ఫైనల్ కలిసి జంటగా ఆస్ట్రేలియన్ ఓపన్ ఎంజాయ్ చేశారని సన్నిహితులు చెబుతున్నారు.
ఒరాకిల్ అనే సాఫ్ట్ వేర్ దిగ్గజ కంపెనీ సీఈవో మార్క హర్డ్ భార్యనే ఈ పౌలా హర్డ్. అంటే 2019లో మార్క్ హర్డ్ క్యాన్సర్ తో మరణించటంతో ప్రస్తుతం ఈమె సింగిల్ గా ఉన్నారు. పౌలాతో ప్రేమాయణం నడుపుతున్న గేట్స్ 67 ఏళ్ల వయసులో కొత్త రిలేషన్షిప్ లోకి అడుగుపెట్టారన్నమాట. పౌలా వయసు 60 ఏళ్లు. గత ఏడాదికాలంగా వీరిమధ్య రిలేషన్షిప్ ఘాటుగా సాగుతోందని యూఎస్ మీడియా లేటెస్ గా చెబుతోంది.
అదేంటి బిల్ గేట్స్, పౌలా హర్డ్ డేటింగ్ లో ఉన్నారన్న విషయం ఇద్దరి సన్నిహితులకు బాగా తెలుసు కదా అంటున్నారు వీళ్ల క్లోజ్ సర్కిల్స్ లో ఉన్నవారు. ఇక హర్డ్ విషయానికి వస్తే ఈమె ఈవెంట్ ప్లానర్ గా, ఫిలాంత్రోపిస్టుగా సుపరిచితం. ఒకప్పుడు ఈమె కూడా టెక్ ఎగ్జిక్యుటివ్ గా పనిచేసేవారు. గేట్స్, పౌలా ఇద్దరూ దాదాపు ఒకే రంగానికి చెందినవారే కావటం విశేషం.
మిలిందా ఫ్రెంచ్ తో బిల్ గేట్స్ 2021లో విడిపోయారు. 30 ఏళ్ల వివాహబంధాన్ని తెంచుకున్న మిలిందా గేట్స్ ఇచ్చే భరణాన్ని కూడా వద్దన్నారు.