HomeTop StoriesAndaman Sea: పడవ బోల్తా.. 250 మంది గల్లంతు!

Andaman Sea: పడవ బోల్తా.. 250 మంది గల్లంతు!

Boat capsizes: అండమాన్‌ సముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. రొహింగ్యా శరణార్థులతో పాటు బంగ్లాదేశ్‌ పౌరులు వెళ్తున్న ఓ పడవ నీట మునిగింది. ఈ ఘటనలో దాదాపు 250 మంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. దీంతో వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిలో చిన్నారులు సైతం ఉన్నారు.

- Advertisement -

కొనసాగుతున్న రెస్య్కూ ఆపరేషన్‌: బోల్తా పడిన పడవ దక్షిణ బంగ్లాదేశ్‌ (Bangladesh)లో టేక్‌నాఫ్‌ నుంచి బయల్దేరినట్లు ఐరాస అధికారులు పేర్కొన్నారు. మలేసియా వెళ్తుండగా బలమైన ఈదురుగాలులు, కెరటాల ఉద్ధృతి కారణంగా మునిగినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఈ పడవలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కినట్లుగా తెలుస్తోంది. వాతావరణ ప్రభావంతో పాటు పరిమితికి మించి ఎక్కడం కూడా ప్రమాదానికి కారణమైన ఉండొచ్చని తెలిపారు. ప్రస్తుతం రెస్య్కూ ఆపరేషన్‌ కొనసాగుతుంది. పూర్తి వివరాలు ఇంకా తెలయాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News