Sunday, November 16, 2025
Homeఇంటర్నేషనల్Antarctica: చనిపోయిన 65 ఏళ్ల తర్వాత అంటార్కిటిక్‌లో బయటపడిన శాస్త్రవేత్త మృతదేహం

Antarctica: చనిపోయిన 65 ఏళ్ల తర్వాత అంటార్కిటిక్‌లో బయటపడిన శాస్త్రవేత్త మృతదేహం

Body of man found in Antarctica 65 years after his death: 65 ఏళ్ల క్రితం అంటార్కిటికాలో అదృశ్యమైన ఒక బ్రిటిష్ శాస్త్రవేత్త మృతదేహం ఇటీవల బయటపడింది. 1959లో ఒక మంచు చీలికలో పడి గల్లంతైన డెన్నిస్ “టింక్” బెల్ అనే మెటియోరాలజిస్ట్ అస్థిపంజరం, ఈ ఏడాది జనవరిలో పోలిష్ పరిశోధకుల బృందానికి దొరికింది.

- Advertisement -

మంచు కరగడంతో బయటపడ్డ మృతదేహం..

కింగ్ జార్జ్ ఐలాండ్‌లో ఉన్న ఎకాలజీ గ్లేసియర్ కరిగిపోవడం వల్ల ఈ అస్థిపంజరం, దానితో పాటు వ్యక్తిగత వస్తువులు బయటపడ్డాయి. జూలై 26, 1959న బెల్ తన సర్వే పనుల సందర్భంగా ఒక మంచు చీలికలో జారిపడ్డాడు. అతడిని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ తర్వాత అతడు కనిపించకుండా పోయాడు.

ALSO READ: Donald Trump: ఒకే వేదికపై పుతిన్, జెలెన్స్కీ? త్రైపాక్షిక భేటీకి ట్రంప్ ప్లాన్!

2025 ప్రారంభంలో, పోలిష్ శాస్త్రవేత్తలు దాదాపు 200 వ్యక్తిగత వస్తువులను కనుగొన్నారు. వాటిలో రేడియో పరికరాలు, ఒక టార్చ్‌లైట్, స్కీ పోల్స్, ఒక వాచ్, కత్తి, అలాగే కొన్ని ఎముకలు ఉన్నాయి. లండన్‌లోని కింగ్స్ కాలేజీలో నిర్వహించిన DNA పరీక్షల్లో ఆ అస్థిపంజరం బెల్‌దే అని నిర్ధారణ అయింది.

ALSO READ: Alaska Summit: శాంతికి పుతిన్ షరతు.. దొనెట్‍స్క్ ఇస్తేనే చర్చలు – అలస్కా భేటీలో తేల్చిచెప్పిన రష్యా!

ఎట్టకేలకు ఇంటికి..

తర్వాత ఈ మృతదేహాన్ని బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే పరిశోధనా నౌక ద్వారా లండన్‌కు తరలించారు. ఈ సంఘటనపై స్పందించిన బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే డైరెక్టర్ ప్రొఫెసర్ డేమ్ జేన్ ఫ్రాన్సిస్, ఇది ‘హృదయాన్ని కదిలించే క్షణం’ అని అభివర్ణించారు. బెల్ సోదరుడు డేవిడ్, తన అన్న ఎట్టకేలకు ‘ఇంటికి తిరిగి వచ్చాడు’ అని చెప్పడం నిజంగా ఆశ్చర్యంగా, ఉపశమనంగా ఉందని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad