Bomb Blast in Pakistan 20 Members Died in Spot: పాకిస్థాన్ ఆత్మాహుతి దాడులతో పాకిస్థాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంగళవారం ఆ దేశంలో భారీ పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్ లోకల్ కోర్టు ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ కారులో బ్లాస్టింగ్ జరగడంతో అక్కడికక్కడే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. దీన్ని భారీ ప్లానింగ్‌తో జరిగిన ఆత్మాహుతి దాడిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అఫ్గాన్ సరిహద్దులోని ఆర్మీ కళాశాల విద్యార్థులను బందీలుగా తీసుకోవాలన్న మిలిటెంట్స్ ప్రయత్నాన్ని పాక్ ఆర్మీ భగ్నం చేసిన తర్వాత రోజే ఈ బాంబ్ బ్లాస్ట్ జరగడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఈ బాంబ్ పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. పేలుడు సంభవించిన ఇస్లామాబాద్ లోకల్ కోర్టు ప్రాంతం.. కోర్టు విచారణల కారణంగా నిత్యం వందలాది మందితో రద్దీగా ఉంటుంది. ఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీసులు, భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ భారీ పేలుడు ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలంలో విస్తృత దర్యాప్తు కొనసాగుతోంది.
ఢిల్లీ కారు బాంబు పేలుడుతో లింక్?
ఢిల్లీలో కారు పేలుడు ఘటన జరిగి 24 గంటలు కాకముందే ఈ ఘటన జరగడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు, అఫ్గాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని ఒక ఆర్మీ కేడెట్ కళాశాల విద్యార్థులను బందీలుగా తీసుకోవడానికి మిలిటెంట్లు చేసిన ప్రయత్నాన్ని పాక్ ఆర్మీ అంతకుముందు రోజు భగ్నం చేసింది. ఈ ఆపరేషన్‌లో భద్రతా దళాలు ఆత్మాహుతి కారు బాంబర్‌తో సహా ఆరుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నాయి. ఆర్మీ ప్రయత్నాన్ని భగ్నం చేసిన మరుసటి రోజే రాజధాని నగరంలో బాంబ్ బ్లాస్ట్ జరగడంతో దీని వెనుక ఉగ్రవాద కోణం ఉందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతానికి, ఈ పేలుడుకు ఏ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయా? అనే విషయాలపై పోలీసులు విచారిస్తున్నారు. దేశంలో పెరుగుతున్న ఉగ్రవాద దాడుల బెడద నేపథ్యంలో ఇస్లామాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ ఘటన దేశ భద్రతా పరిస్థితులపై మరోసారి తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంతి. కోర్టు ఆవరణలో భద్రతా లోపాలు ఉన్నాయా? అనే కోణంలోనూ అధికారులు విచారణ చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఈ ఆత్మాహుతి దాడిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.


