Indian Students Visa Rejection : కెనడాలో చదువుకోవాలని ఆశపడుతున్న భారతీయ విద్యార్థులకు ఆ దేశం గట్టి షాక్ ఇచ్చింది. తాజాగా ఈ ఏడాది ఆగస్టులో దాదాపు 74% భారతీయ వీసాలను ఆ దేశం తిరస్కరించింది. ఈ విషయాన్ని కెనడా ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ గణాంకాలు వెల్లడించాయి.
2025 ఆగస్టులో భారతీయులు కెనడా ఎడ్యుకేషన్ కోసం పంపిన వీసా అప్లికేషన్లలో 74% తిరస్కరణకు గురయ్యాయి. 2023లో ఈ రేటు కేవలం 32% మాత్రమే. చైనా విద్యార్థులకు 24%, మిగతా దేశాల సగటు 40% మాత్రమే ఉండగా ఈ ఏడాది ఈ సంఖ్య భారీగా పెరిగింది. దీంతో భారతీయులకు గట్టి షాక్ తగిలింది.
ALSO READ: YS Jagan Krishna Visit : కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన.. పంట నష్టం “ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా ఎక్కడ?”
కెనడా ప్రభుత్వం విదేశీ విద్యార్థి వీసా ప్రోగ్రామ్‌ను కఠినతరం చేస్తోంది. ఇది భారతీయ విద్యార్థులకు పెద్ద దెబ్బగా మారింది. గత ఏడాది కెనడా 10 లక్షల మంది విదేశీ విద్యార్థులకు అవకాశం ఇచ్చింది. వీరిలో 41% భారతీయులే. కానీ ఇప్పుడు అప్లికేషన్ల రిజక్షన్ మాత్రం పెరుగుతుంది.
కారణాలు – నివాస స్థలాల కొరత, మౌలిక సదుపాయాల లోపం, స్థానిక ఖర్చులు భరించలేకపోవడం. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరగడంతో స్థానికులకు సమస్యలు తలెత్తటం వంటి కారణాలు ఆ దేశం చూపిస్తోంది. ఈ సమస్యలతోనే వీసాలు తగ్గిస్తున్నట్లు తెలిపింది. 2025లో భారతీయ విద్యార్థుల సంఖ్య 2 లక్షలు తగ్గవచ్చని అంచనా వేస్తోంది.
కెనడాకు ఇండియా విద్యార్ధులు ప్రతీ ఏడాది భారీగా వెళ్తూ ఉంటారు. కారణం – తక్కువ ఫీజులు, పని అవకాశాలు ఎక్కువ, PR ఆప్షన్లు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు రిజెక్షన్ రేటు 74%కి పెరగడంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. కెనడా విద్యార్థి స్కాలర్‌షిప్‌లు, పోస్ట్-స్టడీ వర్క్ పర్మిట్లు మార్చడం కూడా మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
భారతీయ ఏజెన్సీలు ఏం చెబుతున్నాయంటే! -“ విద్యార్థులు ఇప్పుడు జర్మనీ, ఆస్ట్రేలియా, UK వంటి దేశాల వైపు చూస్తున్నారు.” జర్మనీలో ఫ్రీ ట్యూషన్, పోస్ట్‌స్టడీ వర్క్ వీసా లభ్యంకావటంతో ఆ దేశానికి డిమాండ్ ఎక్కువ. అలాగే ఆస్ట్రేలియాలో డిమాండ్ కోర్సులు, UKలో PR ఆప్షన్ కూడా ఆకర్షిస్తోంది అని తెలుపుతున్నాయి.
విద్యార్థులు ఏం చెబుతున్నారంటే! -“కెనడా ఆప్షన్ లేకపోతే మరిన్ని దేశాలు అవకాశం కల్పిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెనడా మాత్రం “ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి సీట్లు పరిమితం చేయటంతో భారతీయ విద్యార్థులు అవకాశాలు తగ్గాయి” అంటూ వివరణ ఇస్తోంది.


