Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Canada: కార్మిక విధానాల్లో మార్పులు.. ఇకపై కెనడా వెళ్లి పనిచేయాలంటే కష్టమే

Canada: కార్మిక విధానాల్లో మార్పులు.. ఇకపై కెనడా వెళ్లి పనిచేయాలంటే కష్టమే

Canada: తాత్కాలిక విదేశీ కార్మికుల విధానంలో మార్పులకు కెనడా పూనుకుంది. నిర్దిష్ట రంగాలు, ప్రాంతాల్లో ఎవరు పని చేయాలనే నిబంధనల్లో సంస్కరణలు తీసుకురానుంది. ఈ మేరకు కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ ప్రకటన వెలువరించారు. దీంతో సాఫ్ట్‌వేర్‌, వైద్యరంగానికి చెందిన విదేశీ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. శ్రమతో కూడిన పనులు చేసేవారికి మాత్రమే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తే తమ భవితవ్యం ప్రమాదంలో పడుతుందని భయపడుతున్నారు. ఇకపై, కెనడా వెళ్లాలంటే కష్టమే అని యువత ఆందోళన చెందుతుంది. తాత్కాలిక విదేశీ వర్కర్ల కార్యక్రమం ఒక ‘కేంద్రీకృత విధానం’గా ఉండాలని పార్టీ కాకస్‌లో కార్నీ వ్యాఖ్యానించారు. అది కార్మిక అవసరాలను లక్ష్యంగా చేసుకొనేలా ఉండాలన్నారు. గృహనిర్మాణం, మౌలిక సదుపాయాలు, సామాజిక సేవారంగాలపై ఒత్తిడిని తగ్గించేలా మార్పులు అవసరమని పేర్కొన్నారు. శాశ్వత నివాసులు కాని వారి వాటాను తగ్గించాలని కార్నీ భావిస్తున్నారు. 2027 చివరికి జనాభాలో వారి వాటాను 7 నుంచి 5 శాతానికి తీసుకురావాలని ప్రణాళిక రచిస్తున్నారు. ఇది కార్యరూపం దాలిస్తే తాత్కాలిక కార్మికుల సంఖ్య భారీగా తగ్గనుంది.

- Advertisement -

Read Also: Sarees: పట్టుచీరలు అసలైనవా? కాదా? అని తెలుసుకోవడమెలా?

ఇబ్బంది ఏంటంటే?

అయితే, ఏ మార్పులు తీసుకొస్తామనే విషయంపై అధికారులు పూర్తి వివరాలు వెల్లడించలేదు. కానీ, లేబర్‌ మార్కెట్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ నిబంధనలు కఠినతరం కావొచ్చని విశ్లేషకులు చెబుతున్నమాట. డాక్యుమెంటేషన్‌ ప్రమాణాలు పెంచడం, విదేశీ కార్మికులు త్వరగా ఉపాధి పొందే రంగాలు, ప్రాంతాలను పరిమితం చేయడం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే తమకు అడ్డంకులు తప్పవని అంతర్జాతీయ ప్రతిభావంతులపై ఆధారపడే టెక్‌, ఆరోగ్య సేవాసంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ప్రభుత్వం ఇలా ఆంక్షలు పెడితే ప్రాజెక్టులు ఆలస్యమవుతాయని, వృద్ధిరేటు మందగిస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కెనడా(Canada)కు ఇంకా నైపుణ్యం కలిగిన వలసదారుల అవసరం ఉందని కొందరు వ్యాపారవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. అయితే, ప్రస్తుత వ్యవస్థ వేతనాలను తగ్గిస్తోందని, స్థానిక సేవలను ఒత్తిడికి గురిచేస్తోందనేది విమర్శకుల వాదన. ఈ రెండు వర్గాల మధ్య సమతుల్యం తీసుకురావడానికి ప్రభుత్వం ప్రస్తుతం కసరత్తు చేస్తోంది. బాధ్యతాయుతమైన వలసల నిర్వహణ నిమిత్తం మార్క్‌ కార్నీ ప్రభుత్వం కొంతకాలంగా సంస్కరణలు చేపడుతోంది. వ్యూహాత్మక రంగాలు, ప్రాంతాలను కుదిస్తూ ముందుకెళ్తోంది. తాత్కాలిక నియామకాలపై అతిగా ఆధారపడటాన్ని తగ్గిస్తోంది. నూతన విధానంపై త్వరలో ప్రావిన్స్‌లు, కంపెనీ ప్రతినిధులు, సెటిల్‌మెంట్‌ ఏజెన్సీలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే మార్పులు తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే, అత్యధిక డిమాండ్‌ ఉన్న రంగాల్లో పనిచేస్తున్న వృత్తి నిపుణులపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని పలువురు కెనడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Read Also: India-Pak match: క్రికెటర్లు ఏం చేస్తున్నారు? భారత్- పాక్ మ్యాచ్ పై పహల్గాం బాధితురాలు ఆగ్రహం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad