Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Khalistani: ఖలిస్థానీలకు మా దేశం నుంచే నిధులు- కెనడా ప్రకటన

Khalistani: ఖలిస్థానీలకు మా దేశం నుంచే నిధులు- కెనడా ప్రకటన

Khalistani: కెనడా ఖలిస్థానీ ఉగ్రవాదులకు వేదికగా మారింది. ఖలిస్థానీ ఉగ్రవాదులు కెనడాలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు భారత్‌ అనేక సందర్భాల్లో ఆరోపించింది. ఈ క్రమంలోనే కెనడా ప్రభుత్వం ‘టెర్రర్‌ ఫైనాన్సింగ్‌’పై ఓ నివేదిక విడుదల చేసింది. ఇక్కడి రెండు ఖలిస్థానీ ఉగ్ర సంస్థలకు తమ దేశం నుంచే నిధులు అందాయని తెలిపింది. వాటిని ‘బబ్బర్‌ ఖాల్సా ఇంటర్నేషనల్‌’, ‘ఇంటర్నేషనల్‌ సిఖ్‌ యూత్‌ ఫెడరేషన్‌’గా పేర్కొంటూ.. ‘2025 అసెస్‌మెంట్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ అండ్‌ టెర్రరిస్ట్‌ ఫైనాన్సింగ్‌ రిస్క్స్‌ ఇన్‌ కెనడా’ పేరిట రూపొందించిన నివేదికలో పెర్కొంది.‘‘రాజకీయ ప్రేరేపిత హింసాత్మక తీవ్రవాదం (PMVE) కేటగిరీలో ఉన్న హమాస్‌, హెజ్‌బొల్లా, ఖలిస్థానీ వంటి ఉగ్రసంస్థలకు కెనడా (Canada) నుంచే నిధులు సమకూరుతున్నట్లు అధికారులు వెల్లడించారు. భారత్‌లోని పంజాబ్‌లో స్వతంత్ర దేశస్థాపన కోసం హింసాత్మక మార్గాలకు మద్దతు ఇచ్చే ఖలిస్థానీ తీవ్రవాదులు కెనడా సహా అనేక దేశాల్లో నిధులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి గతంలో కెనడాలో విస్తృతమైన నిధుల సేకరణ నెట్‌వర్క్‌ ఉండేది. కానీ.. ఇప్పుడు ఖలిస్థానీవాదానికి తోడ్పాటునందించే వ్యక్తులే ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది’’ అని నివేదిక పేర్కొంది.
Read Also: Rajini: ఆ కాలేజీలను అమ్మితే పేదల పరిస్థితి ఏమిటి? బాబుపై రజని ఫైర్
స్వచ్ఛంద సంస్థల దుర్వినియోగం

- Advertisement -

అంతేకాకుండా, హమాస్‌, హెజ్‌బొల్లాలు నిధుల కోసం ఛారిటబుల్‌ ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని ప్రధాన మార్గంగా ఎంచుకుంటాయని నివేదిక పేర్కొంది. ఖలిస్థానీ మూకలు సైతం స్వచ్ఛంద సంస్థలతోపాటు తమ నెట్‌వర్క్‌ ద్వారా నిధుల సేకరణ, తరలింపు చేపట్టాయని వెల్లడించింది. అయితే, ఈ మార్గాల ద్వారా సమకూరే నగదు అంతంతమాత్రమే అని పేర్కొంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా అనేది కెనడాకు అతిపెద్ద మనీలాండరింగ్‌ ముప్పుగా ఉందని నివేదిక పేర్కొంది. ఇదిలా ఉండగా.. తమ భూభాగం నుంచే ఖలిస్థానీ ఉగ్రవాదులు కుట్రలకు ప్రణాళికలు చేస్తున్నది నిజమేనని ఈ ఏడాది జూన్‌లో కెనడా అంగీకరించింది. తమ భూభాగం నుంచే ఖలిస్థానీ అతివాదులు కుట్రలకు ప్రణాళికలు చేస్తున్నది నిజమేనని అంగీకరించింది. ఈమేరకు కెనడియన్‌ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ తమ వార్షిక భద్రత రిపోర్ట్‌లో వెల్లడించింది. ‘‘భారత్‌ (India)లో హింసను ప్రోత్సహించడానికి, దాడులు చేయడానికి అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు ఖలిస్థానీ అతివాదులు కెనడాను తమ స్థావరంగా వినియోగించుకుంటున్నారు’’ అని కెనడా నిఘా సంస్థ తమ నివేదికలో తెలిపింది. ఖలిస్థానీలకు సంబంధించి ‘అతివాదులు’ అనే పదాన్ని ఒట్టావా ఉపయోగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారత్‌లోని పంజాబ్‌ ప్రాంతంలో ప్రత్యేక ఖలిస్థానీ దేశం తీసుకురావాలని ఈ అతివాదులు కుట్రలు చేస్తున్నారని ఆ నివేదికలో పేర్కొంది. దౌత్య విభేదాలను పరిష్కరించుకునేలా భారత్‌-కెనడా ప్రధానులు ఇటీవల భేటీ అయిన వేళ.. ఈ నివేదిక రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read Also: Tripti Dimri: అప్పుడు సంతూర్ మమ్మీ.. ఇప్పుడు నేషనల్ క్రష్..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad