Monday, December 9, 2024
Homeఇంటర్నేషనల్Adani: గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు.. ఎందుకంటే..?

Adani: గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు.. ఎందుకంటే..?

Adani| భారత ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ సంస్థ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అగ్రరాజ్యం అమెరికా(America)లో కేసు నమోదైంది. అదానీ, దాని అనుబంధ సంస్థలు 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్‌ డాలర్లు లంచాలు చెల్లించినట్లు న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. దీంతో అమెరికా, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం తెలియజేసి నిధులు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీలో (Adani Green energy) అక్రమ మార్గాల ద్వారా రుణ దాతలు, పెట్టుబడిదారుల నుంచి 3 బిలియన్‌ డాలర్లకు పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని అభియోగాలు మోపారు. ఈ నేపథ్యంలో అదానీ, ఆయన బంధువు సాగర్‌ అదానీ సహా మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

అలాగే అమెరికా సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి అదానీ గ్రీన్‌ ఎనర్జీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి 175 మిలియన్‌ డాలర్లకు పైగా సమీకరించిందని ఆరోపించింది. దీంతో యూఎస్ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ కూ ఆ మరో సివిల్‌ కేసు నమోదు చేసింది. ఈ వార్తలపై అదానీ గ్రూప్‌ మాత్రం ఇంకా స్పందించలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News