Homeఇంటర్నేషనల్Maglev Train: రెండు సెకన్లలోనే 700 కి.మీ మెరుపు వేగం.. చైనా మాగ్లెవ్‌ ట్రైన్‌ వరల్డ్‌...

Maglev Train: రెండు సెకన్లలోనే 700 కి.మీ మెరుపు వేగం.. చైనా మాగ్లెవ్‌ ట్రైన్‌ వరల్డ్‌ రికార్డు

Maglev Train with 700 KM speed: చైనా తన అత్యంత వేగవంతమైన మాగ్లెవ్ రైలుతో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. కేవలం రెండు సెకన్లలోనే గంటకు 700 కి.మీ వేగాన్ని చేరుకుని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 

- Advertisement -

చైనాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ పరిశోధకులు మాగ్నెటిక్ లెవిటేషన్ రైలుపై ఒక పరీక్ష నిర్వహించారు. ఒక టన్ను బరువున్న వాహనంతో ఈ అద్భుతమైన వేగాన్ని సృష్టించగలిగారు.  ఈ పరీక్షను 400 మీటర్ల మాగ్లెవ్ ట్రాక్‌పై నిర్వహించగా.. ఆ వేగాన్ని చేరుకున్న తర్వాత రైలును సురక్షితంగా నిలిపివేయగలిగారు. దీంతో ఇది ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన సూపర్‌ కండక్టింగ్ ఎలక్ట్రిక్ మాగ్లెవ్ రైలుగా చరిత్ర సృష్టించింది.

Also Read: https://teluguprabha.net/national-news/rajasthan-rooftop-solar-plant-installation-power-losses/

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మెరుపు వేగంతో దూసుకుపోతూ కనురెప్ప మూసి తెరిచేలోగానే ట్రాక్‌పై నుంచి దూసుకుపోయింది. ఈ రైలు ట్రాక్ పైన తేలుతూ ఉండే సూపర్ కండక్టింగ్ అయస్కాంతాలను ఉపయోగించారు. ఇవి రైలును ఎత్తి, పట్టాలను తాకకుండానే ముందుకు దూసుకుపోయేలా చేస్తాయి. ఈ వేగంతో, మాగ్లెవ్ నిమిషాల్లో ఎక్కువ దూరాలకు నగరాలను అనుసంధానించగలదు.

ఈ మాగ్లెవ్ టెక్నాలజీ భవిష్యత్తులో వాక్యూమ్-సీల్డ్ ట్యూబ్‌ల ద్వారా రైళ్లు సూపర్ హై స్పీడ్‌లతో ప్రయాణించే హైపర్‌లూప్ లాంటి ప్రయాణం ఎలా సాధ్యమవుతుందో కూడా ప్రదర్శిస్తుంది. “ఇది అల్ట్రా-హై-స్పీడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రొపల్షన్, ఎలక్ట్రిక్ సస్పెన్షన్ గైడెన్స్, ట్రాన్సియెంట్ హై-పవర్ ఎనర్జీ స్టోరేజ్ ఇన్వర్షన్, హై-ఫీల్డ్ సూపర్ కండక్టింగ్ మాగ్నెట్‌లతో సహా ప్రధాన సాంకేతిక సవాళ్లను పరిష్కరిస్తుంది.” అని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది.

Also Read: https://teluguprabha.net/national-news/unnao-rape-survivor-accuses-investigating-officer-collusion-sengar/

 ఏంటీ మాగ్లెవ్‌ టెక్నాలజీ..

మాగ్లెవ్ రైలును వేగవంతం చేయడానికి ఉపయోగించే సాంకేతికతను విద్యుదయస్కాంత త్వరణం అని పిలుస్తారు. దీనిని అంతరిక్షం, విమానయానాల్లో కూడా ఉపయోగించవచ్చు. రాకెట్లు, విమానాలు విద్యుదయస్కాంత వ్యవస్థలను ఉపయోగించి వేగంగా, సున్నితంగా టేకాఫ్‌లను చేయవచ్చు. అదే సమయంలో ఇంధన వినియోగాన్ని తగ్గించి ఖర్చులను తగ్గిస్తుంది.

మాగ్లెవ్‌ రైలు పురోగతికి కారణమైన బృందం 10 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తోంది. కాగా, ఈ ఏడాది జనవరిలో, వారు అదే ట్రాక్‌పై రైలును పరీక్షించగా.. గంటకు 648 కి.మీ. గరిష్ట వేగాన్ని చేరుకోగలిగింది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం, అదే విశ్వవిద్యాలయం దేశంలో మొట్టమొదటి మనుషులతో కూడిన సింగిల్-బోగీ మాగ్లెవ్ రైలును అభివృద్ధి చేసింది. దీనితో చైనా ప్రపంచంలో ఈ సాంకేతికతలో నైపుణ్యం సాధించిన మూడవ దేశంగా నిలిచింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News