చైనా దేశంలో విదేశీ ప్రభావాల్ని నియంత్రించడం, సైద్ధాంతిక భావాలు సడలకుండా ఉండేందుకు, జాతీయ భద్రతను పెంచడానికి ఈ చర్యలు తీసుకున్నట్టు అక్కడి ప్రభుత్వం చెబుతుంది. ఈ ఆంక్షలలో మొదటిగా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ తమ పాస్‌పోర్ట్‌లను స్థానిక అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. వ్యక్తిగత కారణాలతో ప్రయాణించాల్సి ఉంటే ముందస్తు అనుమతిని తప్పనిసరి చేసింది. అయితే విదేశీ పర్యటనలకు స్థానిక అధికారులు అంత సులుగుగా అనుమతులు ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు.
Readmore: https://teluguprabha.net/international-news/russia-kamchatka-earthquake-volcano-eruption-tsunami-alert/
విదేశాలలో చదువుకున్న వారికీ చైనా ప్రభుత్వం కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించింది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పాస్‌పోర్ట్ తిరిగి పొందడంలో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఉద్యోగులు తమ సోషల్ మీడియా ఖాతాలను బహిర్గతం చేయాలని, నివాస ప్రాంతం వదిలి వెళ్లేటప్పుడు అధికారులకు సమాచారం ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.Readmore: https://teluguprabha.net/international-news/india-us-crude-oil-imports-surge/
చైనాలో ప్రస్తుతం 16.7 కోట్ల మంది ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల శ్రామిక వర్గంపై తీవ్ర ప్రభావం పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. చైనా భారతీయ పర్యాటకులు, విద్యార్థుల కోసం మాత్రం వీసా ప్రక్రియను మరింత సులభతరం చేస్తోంది. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చే దిశగా ఇది ఒక ప్రయత్నంగా చూడవచ్చని విశ్లేషకుల అభిప్రాయం.


