China Train Accident 11 Railway Workers Killed by Seismic Testing Train: చైనా (China) దేశంలో మరో ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగింది. యునాన్ ప్రావిన్స్‌లో గురువారం జరిగిన ఈ దుర్ఘటనలో 11 మంది రైల్వే కార్మికులు (Railway Workers) ప్రాణాలు కోల్పోయారు. భూకంప పరికరాల టెస్టింగ్ కోసం ఉపయోగించే రైలు ట్రాక్‌పై పని చేస్తున్న వారిని ఢీకొట్టిందని స్థానిక రైల్వే అధికారులు ధృవీకరించారు. నిబంధనలు పాటించకపోవడం, భద్రతా ప్రమాణాల విషయంలో అధికారుల నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో ఈ విషాద ఘటన మరోసారి రుజువు చేసింది.
ALSO READ: Thailand Floods: వరద గుప్పిట్లో థాయ్‌లాండ్.. 80 దాటిన మృతుల సంఖ్య
కున్మింగ్ రైల్వే బ్యూరో విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ ఘోర ప్రమాదం కున్మింగ్‌లోని లుయోయాంగ్ టౌన్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. తెల్లవారుజామున స్టేషన్‌లో ఒక వంపు ద్వారా భూకంప పరికరాల టెస్టింగ్ రైలు సాధారణంగా ప్రయాణిస్తోంది. సరిగ్గా అదే సమయంలో రైల్వే ట్రాక్ ప్రాంతంలో నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులను రైలు బలంగా ఢీకొట్టింది. 11 మంది అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి దారితీసిన అసలు కారణాలపై అధికారులు వెంటనే విచారణ మొదలుపెట్టారు. రైల్వే కార్మికులు ట్రాక్‌పైకి ఎందుకు వచ్చారు? ఆ ప్రాంతంలో పనులు జరుగుతున్నప్పుడు రైలుకు అనుమతి ఎలా ఇచ్చారు? రైలు సిబ్బందికి కార్మికులున్నట్లు ముందుగా హెచ్చరికలు అందాయా? అనే అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నానికల్లా ట్రాన్స్‌పోర్టేషన్ సాధారణ స్థితికి వచ్చిందని అధికారులు ప్రకటించినప్పటికీ, ఈ ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది.
నిబంధనలు అస్పష్టంగా ఉండటం, పర్యవేక్షణ లోపించడం వంటి కారణాల వల్ల చైనాలో తరచుగా ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఫలితంగా ప్రతి సంవత్సరం వందలాది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నపాటి నిర్మాణ స్థలాలు మొదలుకొని భారీ మైనింగ్ కార్యకలాపాల వరకు భద్రత పట్ల నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. లుయోయాంగ్ టౌన్ ఘటన కూడా కార్మికుల భద్రత పట్ల ప్రభుత్వ, సంస్థల వైఖరిపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఈ ప్రమాదానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ALSO READ: UAE Visa Ban: పాకిస్థాన్‌కు యూఏఈ గట్టి షాక్.. భిక్షాటన, నేరాల కారణంగా వీసాల జారీ బంద్!

