China DF-5C Missile : బీజింగ్‌లో సెప్టెంబర్ 3, 2025న జరిగిన విక్టరీ డే మిలిటరీ పరేడ్‌లో చైనా తన అత్యాధునిక అణు క్షిపణి డీఎఫ్-5సీని ప్రపంచం ముందు ఆవిష్కరించింది. ఈ ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ 20,000 కిలోమీటర్లకు పైగా రేంజి కలిగి, భూగోళంలో ఏ లక్ష్యాన్నైనా చేరగలదు. ఈ క్షిపణి అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించి, శత్రు భూగర్భ స్థావరాలను కూడా ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు.
ALSO READ: Kailasagiri : విశాఖ కైలాసగిరిలో దేశంలోనే అతిపొడవైన గాజు స్కైవాక్ బ్రిడ్జ్ సిద్ధం
డీఎఫ్-5సీని మూడు భాగాలుగా తరలించి, అసెంబ్లింగ్ చేసి ప్రయోగిస్తారు, ఇది గత డీఎఫ్-5 సిరీస్ కంటే వేగవంతమైన సిద్ధీకరణను సాధ్యం చేస్తుంది. ఈ క్షిపణి శబ్దం కంటే 10 రెట్లు వేగంతో 08-15-2025 16:06:50 వేగంగా ప్రయాణిస్తుంది. దీనిలో బైడూ నావిగేషన్, స్టార్‌లైట్ గైడెన్స్ వంటి టెక్నాలజీలతో అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తుంది. ఒకే క్షిపణిలో 12 వార్‌హెడ్‌లను మోసుకెళ్లగల ఎంఐఆర్‌వీ సామర్థ్యం దీని ప్రత్యేకత.
పరేడ్‌లో చైనా తన న్యూక్లియర్ ట్రైయాడ్‌ను ప్రదర్శించింది, ఇందులో గగనతల నుంచి ప్రయోగించే జేఎల్-1, జలాంతర్గామి నుంచి ప్రయోగించే జేఎల్-3, భూ ఆధారిత డీఎఫ్-61, డీఎఫ్-31బీజే క్షిపణులు ఉన్నాయి. అలాగే, ఎల్‌వై-1 లేజర్ వ్యవస్థ, ఏజేఎక్స్002 సముద్ర డ్రోన్, హైపర్‌సోనిక్ వైజే-15, వైజే-17, వైజే-19, వైజే-20 క్షిపణులు, టైప్-100 ఇంటెలిజెంట్ ట్యాంక్‌లు కూడా ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి.
ALSO READ : Punjab Floods: పంజాబ్ జలదిగ్బంధం.. ముంచెత్తిన వరదలు, 30 మంది మృతి
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఈ పరేడ్‌ను పర్యవేక్షించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్-ఉన్‌తో పాటు 26 మంది విదేశీ నాయకులు హాజరయ్యారు. జిన్‌పింగ్ తన ప్రసంగంలో శాంతి, సహకారం, యుద్ధం నుంచి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ పరేడ్‌లో 10,000 మంది సైనికులు, 100 రకాల సైనిక సామగ్రి, 80,000 శాంతి కపోతాల విడుదలతో బీజింగ్‌లోని తియానన్‌మెన్ స్క్వేర్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలు చైనా సైనిక శక్తిని, ఆధునికీకరణను ప్రపంచానికి చాటాయి.


