Chinese Actress Claims Agency Forced Exorcism: చైనాకు చెందిన ప్రముఖ నటి జాయో లుసీ తన టాలెంట్ ఏజెన్సీపై సంచలన ఆరోపణలు చేశారు. తాను మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఏజెన్సీ తనను దుర్వినియోగం చేసిందని, ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఒక గదిలో బంధించి భూతవైద్యం చేయించిందని ఆరోపించారు.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం, 26 ఏళ్ల ఈ నటి తాను డిప్రెషన్, ఆందోళన లక్షణాలతో బాధపడుతున్నప్పుడు టియాంజిన్ గెలాక్సీ కూల్ ఎంటర్‌టైన్‌మెంట్ కల్చర్ మీడియా కో లిమిటెడ్ తనను ఒక హోటల్ గదిలో బంధించి భూతవైద్యం చేయించిందని తెలిపారు. ఆమెకు ‘ది రొమాన్స్ ఆఫ్ టైగర్ అండ్ రోజ్’, ‘హిడెన్ లవ్’ వంటి ప్రముఖ ధారావాహికల ద్వారా మంచి గుర్తింపు లభించింది.
ALSO READ: Melania Trump : ”ఆ పిల్లల ముఖాలు చూసి యుద్ధం ఆపండి”… పుతిన్‌కు మెలానియా ట్రంప్ హృద్యమైన లేఖ!
శారీరక, మానసిక వేధింపులు..
2024 డిసెంబర్ నెలలో జాయో లుసీ అనారోగ్యానికి గురయ్యారు. ఏజెన్సీ తనను మోసం చేసిందని, ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు 2 మిలియన్ యువాన్లు (సుమారు రూ. 2.4 కోట్లు) చెల్లించమని తనను బలవంతం చేసిందని జాయో లుసీ ఆరోపించారు. అంతేకాకుండా, సంవత్సరాల తరబడి తనపై శారీరక, మానసిక వేధింపులకు పాల్పడిందని ఆమె తెలిపారు. ఒకసారి ఒక ఆడిషన్‌లో విఫలమైనందుకు తన బాస్ తెల్లవారుజాము 2 గంటల వరకు బాత్‌రూమ్‌లో పెట్టి తిట్టారని ఆమె స్నేహితురాలు చెప్పారు. అయితే, ఈ ఆరోపణలను ఏజెన్సీ ఖండించింది.
80% ఆదాయం ఆమె నుంచే..
తన వాదనలకు మద్దతుగా, జాయో లుసీ తాను తీవ్రమైన డిప్రెషన్, ఆందోళనతో బాధపడుతున్నట్లు నిర్ధారించిన ఆసుపత్రి పత్రాలను పంచుకున్నారు. ఈ పరిశ్రమను వదిలిపెట్టి ఒక నూడిల్ దుకాణం పెట్టుకోవాలని ఆమె భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆరోపణలపై ఆన్‌లైన్ వినియోగదారులు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఆమె ఏజెన్సీ ఆదాయంలో 80% ఆమె నుంచే వస్తుందని నివేదికలు చెబుతున్నాయి.


