Chinese E-commerce Lord designs Jagannath Doormat: చైనా భారత్‌పై మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. భారతీయుల మనోభావాలను దెబ్బతీసేలా భగవంతుడి ఫోటోలతో డోర్‌మ్యాట్‌లను తయారు చేసి విక్రయిస్తోంది. పూర్తి వివరాలు కథనంలోకి వెళ్లి తెలుసుకుందాం..
చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం అలీఎక్స్‌ప్రెస్.. హిందూ మతంలో, ముఖ్యంగా ఒడిశాలో అత్యధికంగా ఆరాధించబడే జగన్నాథుడి చిత్రంతో డోర్‌మ్యాట్‌లను విక్రయిస్తూ.. భారతీయుల మనోభావాలను గాయపరిచే చర్యకు పాల్పడింది. “లార్డ్ జగన్నాథ్ మండల ఆర్ట్ మ్యాట్ డోర్‌వే” పేరిట రూ. 787.65 ధరతో విక్రయించబడుతున్న ఈ చైనీస్ ఉత్పత్తి భక్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. జగన్నాథుడి పవిత్ర చిత్రంతో డోర్‌మ్యాట్‌పై నిలబడి ఉన్న వ్యక్తి చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఒడిశాలో నిరసనలు చెలరేగాయి.
Also Read: https://teluguprabha.net/international-news/trump-pakistan-oil-deal-india-tariffs/
ఒడిశా నాయకుల తీవ్ర ఖండన
ఒడిశా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. “మహాప్రభు జగన్నాథుడు ప్రతి ఒడియా వ్యక్తి ఆత్మ, భావోద్వేగాలతో ముడిపడి ఉన్నాడు. ఇలాంటి హేయమైన చర్యకు అలీఎక్స్‌ప్రెస్ క్షమాపణ చెప్పాలి” అని ఆమె డిమాండ్ చేశారు. అలీఎక్స్‌ప్రెస్ వెంటనే ఈ ఉత్పత్తిని తొలగించాలని ఆమె ఆదేశించారు. బిజు జనతాదళ్ (బీజేడీ) జాతీయ ప్రతినిధి, ఎంపి అమర్ పట్నాయక్ కూడా ఈ విషయంపై స్పందించారు. “ఈ సిగ్గులేని చర్య లక్షలాది భక్తుల మనోభావాలను గాయపరిచింది. జగన్నాథుడి గౌరవాన్ని పునరుద్ధరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి” అని ఆయన ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పేర్కొన్నారు.
భక్తులు, సోషల్ మీడియా స్పందన
ఈ విషయం వెలుగులోకి రాగానే సోషల్ మీడియాలో భక్తులు, కళాకారులు, రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందించారు. జగన్నాథుడి చిత్రంతో డోర్‌మ్యాట్‌లను విక్రయించడం హిందూ సంస్కృతిని అవమానించడమేనని వారు ఆరోపించారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. జగన్నాథుడి చిత్రంతో డోర్‌మ్యాట్‌ల విక్రయం ఒడిశా భక్తుల భావోద్వేగాలను గాయపరచడమే కాకుండా, హిందూ మత విశ్వాసాల పట్ల అగౌరవాన్ని చూపిందని నాయకులు, భక్తులు ఆరోపిస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/international-news/trump-comments-on-india-russia-trade-tariffs/
అలీఎక్స్‌ప్రెస్ చర్య
భారతదేశంలో ఆగ్రహాజ్వాలాలు చెలరేగిన తరువాత అలీఎక్స్‌ప్రెస్ ఈ ఉత్పత్తిని తన ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించింది. అయినప్పటికీ, ఈ చర్యకు సంస్థ ఇంతవరకు అధికారిక క్షమాపణ చెప్పలేదు. దీనిపై భక్తులు ఇంకా డిమాండ్ చేస్తున్నారు.


