Sunday, November 16, 2025
Homeఇంటర్నేషనల్China: లైంగిక కుంభకోణంలో షావోలిన్ ఆలయ అధిపతి..!

China: లైంగిక కుంభకోణంలో షావోలిన్ ఆలయ అధిపతి..!

Shaolin Temple: కుంగ్‌ ఫూ శిక్షణకు చాలా ప్రసిద్ధి చెందిన హెనాన్‌ ప్రావిన్సులో షావోలిన్‌ ఆలయం ఉంది. షావోలిన్‌ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బౌద్ధారామం. ప్రస్తుతం ఈ  బౌద్ధారామం వార్తల్లో నిలిచింది. మార్షల్‌ ఆర్ట్స్‌కు ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ 30వ అధిపతి షి యోంగ్సిన్‌ పై నేరారోపణలు వచ్చాయి. అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు, నిధుల దుర్వినియోగానికి పాల్పడటం వంటి ఆరోపణలు అతనిపై వచ్చాయి. ఈ ఆరోపణలపై ఆలయ వర్గాలు షి యోంగ్సిన్‌ ని విచారణ చేపడుతున్నట్లు వెల్లడించాయి.

- Advertisement -

షి యోంగ్సిన్‌ అక్రమంగా ఓ చిన్నారికి తండ్రి అయినట్లు ఆలయ వర్గాలు గుర్తించారు. ఇవి అన్ని బౌద్ధ సూత్రాలను ఉల్లంఘించడమేనని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. పలు విభాగాల అధికారులు ఆయన్ను విచారిస్తున్నారని, సంబంధిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెల్లడిస్తామని తెలిపాయి.

Readmore: https://teluguprabha.net/international-news/india-maldives-4850-crore-credit-fta-modi-visit/

షి యోంగ్సిన్‌ అసలు పేరు లియు యింగ్‌ చెంగ్, అతనిపై గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చినట్టు స్థానిక మీడియా ప్రకారం సమాచారంలో ఉంది. ఎంబీఏ చదివిన షి యోంగ్సిన్‌1999 షావోలిన్‌ ఆలయానికి అధిపతిగా నియమితులయ్యారు. వాణిజ్య పరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో సీఈవో మాంక్‌ గా ప్రసిద్ధి చెందారు. 2017లో కూడా ఇతనిపై ఆరోపణలు నమోదవగా.. ఈ ఆరోపణలను హెనాన్ రాష్ట్రం అధికారికంగా విచారించి ఎలాంటి నేరం జరగలేదని ఆరోపణలను తోసిపుచ్చింది.

Readmore: https://teluguprabha.net/international-news/trump-blames-hamas-israel-gaza-war/

సాంగ్‌ పర్వతం దిగువన ఉన్న షావోలిన్‌ ఆలయం క్షేత్రాన్ని క్రీ.శ 495లో స్థాపించారు. 1500 ఏళ్ల నాటి ఈ ఆలయానికి చారిత్రక, మతపరమైన ప్రాముఖ్యత ఎంతగానో ఉంది. ఈ ఆలయం మార్షల్‌ ఆర్ట్స్‌ కి ప్రసిద్ధి గాంచింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులు ఇక్కడకు వచ్చి శిక్షణ తీసుకుంటారు. పర్యాటకంగానూ ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం షి యోంగ్సిన్‌ ఎదుర్కొంటున్న ఆరోపణలతో ఆలయ ప్రతిష్ట దెబ్బతినేలా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad