బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ నేత చిన్మయ్ కృష్ణ దాస్‌కు(Chinmoy Krishna Das) ఊరట లభించింది. ఆయనపై నమోదైన దేశద్రోహం ఆరోపణల కేసులో ఢాకా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
- Advertisement -
గతేడాది నవంబర్ 25న ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశద్రోహం ఆరోపణలపై పోలీసులు చిన్మోయ్ కృష్ణ దాస్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. ఆయన బంగ్లాదేశ్ జాతీయ హిందూ మహజోత్, ఇస్కాన్ సంస్థలతోనూ సంబంధాలు కలిగి ఉన్నారు.
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఆగస్టు 8న బాధ్యతలు చేపట్టింది. అప్పటి నుంచి ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగాయి. హిందువుల ఇళ్లు, దేవాలయాలు, వ్యాపార సంస్థలపై దాడులు జరిగాయి.