కెనడా నోవా స్కోటియా తెలుగు అసోసియేషన్ హాలిఫాక్స్ లో వైభవంగా అంబరాన్ని అంటిన సంక్రాంతి, భోగి & కనుమ వేడుకలు ఘనంగా సాగాయి.
మన తెలుగు ప్రజలు, కెనడా, నోవా స్కోటియాలో సంక్రాంతి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. హాలిఫాక్స్, డార్ట్ మౌత్ , బెడ్ ఫోర్డ్ మరియు సమీప గ్రామికులందరు కలసి బెడ్‌ఫోర్డ్‌లోని ఫ్రెంచ్ స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. నిర్వాహకులు శ్రీమతి సుప్రజా హరి గారు, శ్రీమతి ప్రియాంక సురేష్ గారు, కుమారి శ్రీలేఖ మరియు వారి బృందం కలిసి వేదికను మన సంక్రాంతి పండుగ సంప్రదాయం ఉట్టిపడేలా ముగ్గులతో, గాలిపటాలతో, పూల తోరణాలతో , భోగి కుండలతో అలంకరించారు, ఇది పండుగ యొక్క జనన అనుభూతిని కలిగించింది. కెనడా నోవా స్కోటియాలోని 300 కి పైగా తెలుగు కుటుంబాలు వేడుకకు పండుగ కళను తీసుకు రావడానికి అచ్చ తెలుగు సాంప్రదాయ దుస్తులు ధరించి కన్నుల విందు చేశారు.
అతిథి దేవోభవ అని పెద్దలచే (కెనడా కి విజిటింగ్ కి వచ్చిన వారు) జ్యోతి ప్రజ్వలన శ్రీమతి. కనకం గారు,శ్రీమతి. దేవిక గారు,శ్రీమతి. పార్వతి గారు; శ్రీమతి.ప్రతిభ గారు; శ్రీమతి. సుప్రజాహరి గారుచేయించి, గణేశ వందనం తో సంక్రాంతి సంబరాలను ఘనంగా ప్రారంభించారు.
ఈ వేడుకలు కెనడా నోవా స్కోటియా తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీహరి రెడ్డి చల్లా గారి ఆధ్వర్యంలో స్పాన్సర్లు (కెనడా ఎడ్యుకేషన్ కనెక్ట్- విజయ్ రాహుల్ భాష్యకర్ల గారు, శ్రీహరి రెడ్డి చల్లా గారు, ఇండియన్ గ్రోసరీస్ – జితేందర్ బాలి గారు, టైటాన్ ఓక్ ఫైనాన్షియల్ సర్వీస్ యాజమాన్యం: ఆండ్రూ లీపర్ గారు, వన్ రియాల్టీ ఈస్ట్ -శివ నవనీథన్ గారు మరియు శ్రీహరి గారి బృందం సహకారం తో విజయవంతంగా నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం తెలుగు పండుగలకు మూలమని, భావి తరాలకు మన సంప్రదాయాలను తెలియజేసేందుకు దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
నృత్య వేదికలో పిల్లలు నిత్య శ్రీ విద్య; రోహిత్ సాయి చల్లా, శ్రీనివాస్ చిన్ని మరియు కుటుంబం; మహాశ్విన్ విద్యా; సుసుష్మ ప్రదీప్ వేదాన్షిక సురేష్; మిహిర మొగలిపురి; శ్రేష్ఠ శ్రీమయీ దొంతంశెట్టి; అమూల్య పిన్ని ని; సంగీత రాజు; కీర్తన రాజీవ్, మెగ్గీ కరమ్, మోక్షిత చిన్ని; సాయి రేయాన్ష్ చిన్ని; హర్షవర్ధన్ ఆలేటి; శిబి నందన్ మహేష్ కుమార్; జోషిత్ మొగలి పురి; ఆరాధ్య మల్కా; పూజ బరన్వాల్ ; రితి నైనికా కోతా; రిధి బొజ్జిని- అంతా అలరించారు.
ఫోటోగ్రఫీ & వీడియోలు & మీడియా సహాయ సహకారాలు అందజేసిన వారు వెంకట్ గారు, సత్యం గారు & సర్ధార్ ఖాన్ గారు.
భోగ భాగ్యాలనిచ్చే భోగి అనే కేరింతలతో చిన్న పిల్లలకు ముత్తైదువులతో భోగి పళ్ళు పోయించి చిన్నారులని కలకాలం ఆయురారోగ్యాలతో ఉండమని దీవించారు.. చిన్న పెద్ద అందరూ కలిసి భోగి మంటల చుట్టూ నృత్యం చేశారు. ఆ సమయంలో వేదిక చాల క్యూట్‌నెస్ మరియు ఆనందంతో నిండిపోయింది.
సరదాలు తెచ్చే సంక్రాంతి, హరిదాసుల ప్రదర్శనలతో, డూ డూ బసవన్న మాటలతో అబ్బురపరిచాయి. జానపదం, కూచిపూడి, భరతనాట్యం, ఒడిసి, తెలుగు చిత్రాల పాటలు నృత్యాల వంటి అనేక సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శించబడ్డాయి. ప్రజలు వాటిని చూసి చాలా ఆనందించారు, పండుగలంటే ఇలా ఉండాలి అన్న అనుభూతిని కలిగించాయి. అందరు మైమరచి మన తెలుగు ఔన్నత్యాన్ని కొనియాడారు.
ఆటపాటలతో అలరించే కనుమ అనుచూ చిరంజీవి. సిబి నాథన్ కర్ర సాము నైపుణ్యంతో అందరిని ఆశ్చర్య చకితులను చేశారు. తదుపరి “సొగసు చూడ తరమా’ అనుచూ భార్య భర్తల మధ్య పోటీలు ముచ్చట కలిగించాయి. మరియు చిన్నారుల అట పాటలతో ఈవెంట్‌కు మరింత వినోదాన్ని జోడించింది. కళాకారులందరికీ పార్వతి శాస్త్రి చెల్లూరి గారు, వేణుగోపాల్ రావు బెజవాడ గారు , నూకరాజు కరణం గారు జ్ఞాపికతో సత్కరించారు.
శ్రీనివాస్ చిన్ని గారు బృందం ప్రజలందరికీ అరటి ఆకులో రుచికరమైన తెలుగు వారి సంక్రాంతి ప్రత్యేక పండుగ విందు భోజనాలు అందించారు.
కెనడా నోవా స్కోటియా సంక్రాంతి సంబరాలు ఆరు గంటల పాటు ఎంతో సరదాగా, ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమం ముగిసే సమయానికి, నిర్వాహకులు ప్రతి ఒక్కరికి, స్పాన్సర్‌లకు మరియు వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కెనడా నోవా స్కోటియా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ హరి గారు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవడం మూలంగా మన పండుగలు మరియు సంప్రదాయాలు భావితరాలకు తెలియజేసే ముందుకు తీసుకు వెళ్ళడానికి దోహదం చేస్తాయి అని వ్యక్తీకరించారు. మన సంస్కృతి మరియు ప్రేమను తరువాతి తరానికి పంచాలని ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు జరగాలని ఆశించారు.
శ్రీమతి సుప్రజ హరి గారు ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము తో అనే విధంగా కెనడా నోవా స్కోటియా తెలుగు అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు.