Saturday, November 15, 2025
HomeTop StoriesH-1B Fee Hike: వైట్ హౌస్ సంచలన నివేదిక.. 5 వేల H-1B వీసాలు..16 వేల...

H-1B Fee Hike: వైట్ హౌస్ సంచలన నివేదిక.. 5 వేల H-1B వీసాలు..16 వేల అమెరికన్ల తొలగింపు

US Defends Massive H-1B Fee HikeH-1B వీసా దరఖాస్తులపై ఏకంగా $100,000 (సుమారు రూ. 83 లక్షలు) భారీ ఫీజు విధించాలన్న తన నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గట్టిగా సమర్థించుకుంది. అమెరికన్ ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో “తక్కువ జీతాలకు పనిచేసే విదేశీ కార్మికులను” నియమించుకుంటున్నారని, ఈ వీసాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ చర్య తీసుకున్నామని శ్వేతసౌధం (వైట్ హౌస్) ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

- Advertisement -

ALSO READ: H-1B visa: H-1B వీసా స్థానంలో లక్షల డాలర్ల ‘గోల్డ్, ప్లాటినం, కార్పొరేట్ గోల్డ్’ కార్డులు.. ఏమిటివి?

శ్వేతసౌధం విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్‌లో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది. కొన్ని కంపెనీలు H-1B వీసాలను ఎలా దుర్వినియోగం చేస్తున్నాయో ఉదాహరణలతో సహా వివరించింది.

  • ఒక కంపెనీ 2025 ఆర్థిక సంవత్సరానికి 5,189 H-1B వీసాలు పొంది, అదే ఏడాది 16,000 మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించింది.
  • మరో కంపెనీ 1,698 H-1B వీసాలు పొంది, ఒరెగాన్‌లో 2,400 మంది అమెరికన్లను ఉద్యోగాల నుంచి తీసేస్తున్నట్లు ప్రకటించింది.
  • ఇంకో కంపెనీ 2022 నుంచి 27,000 మంది అమెరికన్లను తొలగించగా, అదే సమయంలో 25,075 H-1B వీసాలకు అనుమతులు పొందింది.

“అమెరికన్ వర్కర్స్ ఫస్ట్” అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్, అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించేందుకే కట్టుబడి ఉన్నారని వైట్ హౌస్ పేర్కొంది. ఐటీ రంగంలో H-1B వీసాలు పొందిన వారి వాటా 2003లో 32% ఉండగా, ఇప్పుడు అది 65% దాటిందని, దీనివల్ల అమెరికన్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది.

ALSO READ: Bagram Air Base: తాలిబాన్‌లకు ట్రంప్‌ హెచ్చరిక.. ‘బాగ్రామ్’ను అప్పగించాలని డిమాండ్!

ఈ నిర్ణయం భారతీయ టెక్ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం H-1B వీసాలలో 71-72% భారతీయులకే జారీ అవుతాయి. ఈ పరిణామంపై భారత ప్రభుత్వం కూడా స్పందించింది. అమెరికా నిర్ణయం వల్ల కలిగే పూర్తి ప్రభావాలను పరిశీలిస్తున్నామని, దీనివల్ల అనేక కుటుంబాలు ఇబ్బందులు పడే “మానవతావాద పరిణామాలు” ఉండవచ్చని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.

ALSO READ: Recognise Palestine: బ్రిటన్‌, కెనడా కీలక నిర్ణయం.. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తూ సంచలన ప్రకటన

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad