ఉజ్బెకిస్తాన్ లో 18 మంది చిన్నారుల ఉసురు తీసిన పాపం మీదేనంటూ భారత్ పై మండిపడింది. ఈమేరకు ఓ అధికారిక ప్రకటన సైతం ఉజ్బెక్ ప్రభుత్వం విడుదల చేసింది. మనదేశంలోని నోయిడాలో తయారైన దగ్గు మందు సేవించిన చిన్నారుల మరణించటం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దగ్గు మందులో ఇథిలిన్ గ్లైకాల్ ఉన్నట్టు ల్యాబ్ టెస్టుల్లో తేలింది. దీంతో Doc-1 Max ట్యాబ్లెట్స్, సిరప్ ను దేశంలోని అన్ని మందుల షాపుల నుంచి విత్ డ్రా చేశారు. 2022లో ఇలా భారత్ లో తయారైన దగ్గు మందు సేవించి చిన్నారులు మరణించటం రెండోసారి. అంతకు ముందు గాంబియాలో 70 మంది చిన్నారులు మేడ్ ఇన్ ఇండియా కాఫ్ సిరప్ తీసుకోవటం మరణించారు. దీనికంతా కారణమైన హర్యానా కేంద్రంగా ఉన్న మైడెన్ ఫార్మాను కేంద్రం మూపించింది కూడా.
Cough syrup scam: ఈ పాపం ‘మేడ్ ఇన్ ఇండియా’దే అంటున్న ఉజ్బెకిస్తాన్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES