Saturday, May 17, 2025
Homeఇంటర్నేషనల్మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఆదేశాల్లో భారీగా పెరుగుతున్న కేసులు..!

మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఆదేశాల్లో భారీగా పెరుగుతున్న కేసులు..!

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఆసియాలోని పలు దేశాల్లో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్ వంటి జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో ఈ పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. 7 మిలియన్లకు పైగా జనాభా కలిగిన హాంకాంగ్ నగరంలో కరోనా వైరస్ గణనీయంగా వ్యాప్తి చెందుతోంది.

- Advertisement -

ప్రస్తుతం ఆ దేశంలో వైరస్ ఉదృతి చాలా ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం శ్వాసకోశ నమూనాల్లో పాజిటివ్ రేటు గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగింది. మే 3తో ముగిసిన వారంలో 31 మరణాలు నమోదయ్యాయి. ఇదే వారంలో కరోనా వైరస్ ఉధృతి కూడా భారీగా పెరిగింది. వైద్య సంప్రదింపులు, ఆసుపత్రుల్లో చేర్పులు పెరగడం ద్వారా సమాజంలో విస్తృత వ్యాప్తి జరుగుతున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.

ఇక సింగపూర్‌లో కూడా కోవిడ్-19 కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మే 3తో ముగిసిన వారంలో 14,200 కేసులు నమోదయ్యాయి. ఇది గత వారంతో పోల్చితే 28 శాతం అధికం. ఆసుపత్రిలో చేర్పు సంఖ్య కూడా 30 శాతం పెరిగింది. ఇది ఒక సంవత్సరానికై సింగపూర్ ప్రభుత్వం విడుదల చేసిన తొలి పబ్లిక్ అప్‌డేట్ కావడం గమనార్హం. ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, రోగనిరోధక శక్తి తగ్గడం వల్లే ఈ పెరుగుదల సంభవించిందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న వేరియంట్లు గతంలో ఉన్న వాటి కంటే తీవ్రత.. వ్యాప్తి పరంగా ఎక్కువగా కనిపించడం లేదని స్పష్టం చేశారు.

ఈ రెండు నగరాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజారోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు తప్పనిసరిగా టీకాలు, బూస్టర్ డోసులు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈసారి కరోనా వేసవిలో కూడా విజృంభిస్తున్నదన్న విషయం ఆందోళన కలిగిస్తోంది. వైరస్ వ్యాప్తి ప్రభావం పబ్లిక్ ఈవెంట్లపై పడుతోంది. ప్రముఖ హాంకాంగ్ గాయకుడు ఈసన్ చాన్ తైవాన్‌లో మేలో నిర్వహించాల్సిన కచేరీలను రద్దు చేసుకున్నారు. కరోనా కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

చైనాలో కూడా పరిస్థితి మారుతోంది. మే 4తో ముగిసిన ఐదు వారాల్లో కరోనా పాజిటివిటీ రేటు రెండింతలకుపైగా పెరిగినట్టు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నివేదించింది. అలాగే థాయిలాండ్‌లోని సాంగ్‌క్రాన్ పండుగ అనంతరం కేసులు పెరిగాయని అధికారులు తెలిపారు. ఆ దేశంలో ఇప్పటికే రెండు క్లస్టర్ ఔట్‌ బ్రేక్స్ నమోదయ్యాయి. ఇది మరింత వ్యాప్తికి కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. కరోనా విజృంభణ ఇంకా పూర్తిగా ముగిసినట్టుగా భావించకూడదు. తాజా గణాంకాలు చూస్తే, మరోసారి అప్రమత్తత అవసరమని స్పష్టమవుతోంది. వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడమే కాకుండా, టీకాలు తీసుకోవడం, ఎక్కువ జనసంఖ్య గల ప్రదేశ avoided చేయడం వంటివి మళ్లీ అనివార్యమవుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News