టీమిండియా క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్.. అల్ట్రా ప్రీమియం బ్రాండ్ FINO టెకీలాను ప్రారంభించారు. దీంతో లగ్జరీ స్పిరిట్స్ మార్కెట్లోకి యువీ అడుగుపెట్టాడు. ప్రస్తుతం అమెరికాలో దీనిని ప్రారంభించారు.. 2025 ఏప్రిల్ నాటికి భారత మార్కెట్లోకి దీనిని ప్రవేశ పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/FINO-1024x731-1.jpg)
ఈ ఫినో టెకీలా బ్రాండ్ ఉత్పత్తులను మెక్సికోలోని జూలిస్కోలో తయారు చేస్తున్నట్లు వివరించారు. చికాగోలో బ్రాండ్ ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫినో టెకీలా ప్రపంచంలోని అత్యుత్తమ టెకీలాను ఉత్పత్తి చేస్తుందని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ FINO టెకీలాకు యువీ కెరీర్ వ్యక్తిగత జీవితాన్న ఆధారంగా చేసుకొని “ఫెయిల్యూర్ ఈజ్ నాట్ యూన్ ఆప్షన్” అనే క్యాప్షన్ తో బ్రాండ్ ఏర్పడినట్లు తెలిపారు. ఖనిజాలు అధికంగా ఉండే మట్టిలోని 100 శాతం బ్లూ అగావ్.. నుంచి ఫినో టెకీలా తయారవుతుందని చెప్పారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/Yuvraj-Singh-Pina-1-1024x1002-1.jpg)
ఈ బ్రాండ్ పేరు కూడా ఎంతో ప్రత్యేకమైనది. FINO అంటే స్పానిష్‌లో “చక్కగా/ సున్నితమైనది” అని అర్థం. ప్రారంభంలో బ్లాంకో, రోసాడో, అనెజో మరియు పరిమిత ఎడిషన్ ఎక్స్‌ట్రా అనెజోలలో అందుబాటులో ఉన్న FINO.. జీవితాన్ని అసాధారణ ప్రయాణంగా భావించే వారికి ఎంపిక చేసుకునే ఆర్టిసానల్ టేకిలాగా మారుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.
ఫినోటోని నాయకత్వ బృందంలో చీఫ్ ప్రొడక్ట్ ఎక్స్ లెన్స్ ఆఫీసర్ గా జానా అయ్యర్, చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ గా సోనాలి పటేల్ ఉన్నారు. హెల్త్ కేర్, వ్యాపార రంగంలో తమ నైపుణ్యాలతో బ్రాండ్ ను మరో స్థాయికి తీసుకెళ్తారని కంపెనీ అధికారులు తెలిపారు. యూఎస్ లో బ్రాండ్ ఉత్పత్తులను విజయవంతంగా లాంచ్ చేయడంతో పాటు ఫినో టెకీలా ప్రత్యేక అవుట్ లెట్ల ద్వారా భారత మార్కెట్లోకి ప్రవేశిచాలని చూస్తోంది. ప్రీమియం స్పిరిట్ లను కోరుకునే వినియోగదారులకు కంపెనీ ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకున్నారు. అయితే భారత్ లో ఏప్రిల్ 2025 నాటికి కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించాలని అనుకుంటున్నారు. కానీ దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.