Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Cyber attack: యూరప్‌లోని ప్రధాన విమానాశ్రయాలపై సైబర్ దాడి.. రాకపోకలకు తీవ్ర అంతరాయం..!

Cyber attack: యూరప్‌లోని ప్రధాన విమానాశ్రయాలపై సైబర్ దాడి.. రాకపోకలకు తీవ్ర అంతరాయం..!

Europe airport cyber attack: యూరప్‌లోని కీలకమైన పలు విమానాశ్రయాలు ఓ భారీ సైబర్ దాడికి గురయ్యాయి. ఈ దాడి కారణంగా లండన్ హీత్రో, బ్రసెల్స్, బెర్లిన్ వంటి ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కార్యకలాపాలు పూర్తిగా స్థంభించాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ సైబర్ దాడి ద్వారా విమానాశ్రయాల సర్వీస్ ప్రొవైడర్లను లక్ష్యంగా చేసుకున్న హ్యాకర్లు, ముఖ్యమైన ఆన్‌లైన్ సిస్టమ్‌లను ధ్వంసం చేశారు. యూరప్‌లోని పలు విమానాశ్రయాల్లో చెక్-ఇన్, బోర్డింగ్, ఫ్లైట్ సమాచారం వంటి సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, సైబర్‌ అటాక్‌తో అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. కొన్ని విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా బ్రసెల్స్ విమానాశ్రయంలో ఆటోమేటెడ్ చెక్-ఇన్, బోర్డింగ్ సిస్టమ్‌లు పూర్తిగా నిలిచిపోయాయని అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ సైబర్ దాడి కారణంగా విమానాల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయని అంతర్జాతీయ మీడియా సంస్థలు ధృవీకరించాయి. ప్రయాణికులు తమ విమాన సర్వీసుల తాజా సమాచారం కోసం సంబంధిత విమానయాన సంస్థల వెబ్‌సైట్లను పరిశీలించాలని అధికారులు సూచించారు. ఈ సమస్యపై విమానాశ్రయ అధికారులు స్పందిస్తూ, “మా టెక్నికల్‌ టీం సైబర్‌ అటాక్‌కు గురైన సిస్టమ్‌లను పునరుద్ధరించడంపై నిరంతరం పనిచేస్తున్నాయి. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తాం” అని హామీ ఇచ్చారు. ఇప్పటికే విమానాశ్రయాలకు చేరుకున్న ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా వారు వెల్లడించారు. ఈ సంఘటన యూరప్‌లోని విమానాశ్రయాల సైబర్ భద్రతలోని లోపాలను మరోసారి ఎత్తిచూపింది. ఇటీవల జపాన్ ఎయిర్‌లైన్స్‌పై కూడా ఇలాంటి దాడే జరిగింది.

- Advertisement -

Read Also: https://teluguprabha.net/cinema-news/28-yeras-later-ott-netflix-streaming/

సైబర్‌ అటాక్స్‌తో ఆలస్యంగా పలు విమానాలు..

కాగా, సైబర్‌ అటాక్స్‌ కారణంగా బ్రసెల్స్ విమానాశ్రయంలో పలు విమానాలు రద్దు కాగా.. విమానాలు కన్ఫర్స్ అయిన తర్వాత మాత్రమే ప్రయాణించాలని అధికారులు సూచించారు. మాన్యువల్ ప్రక్రియ చాలా స్లోగా ఉన్నందున షెన్‌గన్ విమాన ప్రయాణాలకు రెండు గంటల ముందు, నాన్ షన్‌గన్ విమాన ప్రయాణాలకు మూడు గంటల ముందు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలని ప్రయాణికులను కోరింది. అటోమెటెడ్ చెక్-ఇన్, బోర్డింగ్ సేవల్లో తలెత్తిన సమస్యలను సరిచేసేందుకు తమ సాంకేతిక బృంద శ్రమిస్తోందని, త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని అధికారులు ప్రకటించారు. సాంకేతిక కారణాల వల్ల విమానాల ప్రయాణాల్లో జాప్యం తలెత్తినట్టు లండన్ హీత్రో ప్రకటించింది. దాదాపు యూరప్‌లోని అన్ని ప్రఖ్యాత విమానాశ్రయాలు సైబర్ దాడికి గురైనట్టు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. కాగా, జ్యూరిచ్, ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయాలపై సైబర్ అటాక్ ప్రభావం లేదని, యథాప్రకారం సేవలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad