America: గగనంలో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పైలట్ అప్రమత్తంగా లేకుంటే డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఘోర ప్రమాదాన్ని చవిచూసేది.
విమాన ప్రమాద సంఘటనలు ఈరోజుల్లో కలకలం రేపుతున్నాయి. విమానాల్లో సాంకేతిక సమస్యలతో గాల్లోకి వెళ్లిన విమానాలు అర్థాంతరంగా ల్యాండ్ అవుతున్నాయి. ఇటీవల ఈ నెల 10న మిన్నియాపొలిస్ నుంచి మైనట్‌కు వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానానికి, బీ-52 బాంబర్ యుద్ధ విమానం ఎదురుగా దూసుకు వచ్చింది. 30 వేల అడుగుల ఎత్తులో ఉన్న డెల్టా విమానం పైలట్ వెంటనే గుర్తించి అగ్రెసివ్ మాన్యువర్ చేశాడు. దాంతో పెను ప్రమాదం తప్పింది.
Readmore: https://teluguprabha.net/international-news/bangladesh-air-force-jet-crashes-into-school-in-dhaka/
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సమాచారం ప్రకారం.. యుద్ధ విమానం, డెల్టా విమానం.. రెండు విమానాల మధ్య దూరం 1.7 నాటికల్ మైళ్ల కంటే తక్కువగా ఉంది. ఇది రాడార్ కంట్రోల్ స్టాండర్డ్ సెపరేషన్ దూరం కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో డెల్టా పైలట్ విమానాన్ని దిగువకు తీసుకెళ్లి పెను ప్రమాదాన్ని నివారించాడు.
అయితే యుద్ధ విమానం తమకు ఎదురుగా వస్తున్న విషయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ఆదేశాలు రాలేదని డెల్టా పైలట్ తెలిపారు. తాము రాడార్ పర్యవేక్షణలో ఉన్నామని అనుకున్నామని డెల్టా పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో జరిపిన సంభాషణలో చెప్పాడు.
Readmore: https://teluguprabha.net/international-news/us-green-card-delay/
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియోలో యుద్ధ విమానం గురించి సమాచారం ఇవ్వకపోవడం, రాడార్ వ్యవస్థ నుంచి సిగ్నల్ లేకపోవడం వల్ల ఇలా జరిగిందని పైలట్ వివరిస్తున్నట్లు ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఈ ఘటనపై ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ దర్యాప్తు చేస్తున్నాయి. పైలట్లు ప్రామాణిక ప్రొసీజర్‌ను అనుసరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారని డెల్టా ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎవరికీ గాయాలు కాలేదని అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.


