Monday, January 20, 2025
Homeఇంటర్నేషనల్USA: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ జీతం ఎంతో తెలిస్తే.. షాక్ అవుతారు..!

USA: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ జీతం ఎంతో తెలిస్తే.. షాక్ అవుతారు..!

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. క్యాపిటల్ భవనంలో.. USA 47వ అధ్యక్షుడిగా ట్రంప్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాధినేతలు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే ఈ సమయంలో ట్రంప్ కి అమెరికా అధ్యక్షుని హోదాలో నెలకు ఎంత జీతం లభిస్తుంది.. ఎలాంటి సౌకర్యాలు అందుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ జీతం.. ఏడాదికి 4 లక్షల డాలర్లుగా ఉంటుంది.

- Advertisement -

అంటే మన భారతీయ కరెన్సీలో ఈ విలువ సుమారు రూ.3.36 కోట్లు . దీన్ని నెలవారీగా చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని నెల వారీగా చూస్తే ఇంచుమించు రూ.30 లక్షలు అందుతుంది. జీతంతో పాటు అధికారిక విధుల నిర్వహణకు అవసరమైన ఖర్చుల నిమిత్తం ఏడాదికి మరో దాదాపు మరో 42 లక్షలు అందుకుంటారు. ఇక అధ్యక్షుడిగా ఎన్నికైన వారు తన అభిరుచికి అనుగుణంగా శ్వేతసౌధాన్ని మార్చుకునేందుకు వీలుగా ఒక్కసారి మాత్రమే లక్ష డాలర్లు.. అంటే 84 లక్షలు కేటాయిస్తారంట. అంతేకాకుండా ప్రయాణ ఖర్చుల కోసం మరో లక్ష డాలర్లు, వినోదం కోసం 16 లక్షల నగదు కేటాయిస్తారంట.
ఇక జీతం మాట అటుంచితే.. అధ్యక్షుడికి సకల సౌకర్యాలు అందుతాయి. వాషింగ్టన్‌ డీసీలో అధ్యక్షుడు నివసించేందుకు అత్యంత విలాసవంతమైన అధికారిక భవనం వైట్ హౌస్ ఉంటుంది. ఇందులో అధ్యక్షుడి కుటుంబం మొత్తం నివసించొచ్చు. 18 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనం విస్తరించి ఉంటుంది. ఇందులో వంట, ఇతర పనుల కోసం దాదాపు 100 మంది సహాయకులు ఉంటారు. ఇక అధ్యక్షుడికి భోజనాలు తయారు చేసేందుకు ప్రపంచంలోనే టాప్‌ షెఫ్‌లు ఉంటారు.

అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లాలన్నా.. అత్యంత భద్రతతో కూడిన వాహనాలనే వినియోగిస్తారు. అధ్యక్షుడికి అత్యంత విలాసవంతమైన. ప్రపంచంలోనే అత్యున్నత భద్రతతో కూడి ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం, మెరైన్‌ వన్‌ హెలికాప్టర్‌ కూడా ఉంటుంది. ఈ హెలికాప్టర్‌ భారీ పేలుళ్లను కూడా తట్టుకోగలదు. ఇలాంటివి అధ్యక్షుడికి ఐదు ఉంటాయి. ఇక ప్రపంచంలోనే అత్యంత భద్రమైన ‘బీస్ట్‌’ కారులో అధ్యక్షుడు ప్రయాణిస్తుంటారు. ఇతర దేశాలకు వెళ్లినా సరే ఈ కారునే అధ్యక్షుడి వెంట తీసుకెళ్తుంటారు.

అధ్యక్షుడితోపాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్య సేవలు ఉచితంగా అందుతాయి. ఇక అధ్యక్షుడిగా పదవీ విరమణ తర్వాత కూడా అనేక ప్రయోజనాలు పొందుతారు. మాజీ అధ్యక్షుడికి ఏడాదికి 2.30 లక్షల డాలర్ల పెన్షన్‌ అందుతుంది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం.. రూ.1.93 కోట్లన్నమాట. ప్రయాణ భత్యాలు, కోరుకున్న చోట నివాసం, సిబ్బంది వంటి సదుపాయాలు కూడా అందిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News