ప్రపంచ జనాభా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా ప్రపంచ జనాభా(World Population) ఎంత ఉందో యూఎస్ సెన్సస్ బ్యూరో తెలిపింది. 2024 చివరి నాటికి జనాభా 7.1 కోట్లు పెరిగి 800.9 కోట్లకు చేరుకున్నట్లు అంచనా వేసింది. మొత్తంగా 0.9 శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది. అయితే గతేడాది (7.5కోట్లు)తో పోలిస్తే స్వల్ప తగ్గుదల ఉందని పేర్కొంది. ఇక 2025లో ప్రతి సెకనుకు 4.2 జననాలు, 2 మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది.
- Advertisement -
అలాగే అమెరికా జనాభా 26 లక్షలు పెరిగి 34.1కోట్లకు చేరుకుంటుందని వెల్లడించింది. జనవరి నుంచి ఈ ఏడాది చివరికి 0.78 శాతం(26,40,171) పెరుగుదల నమోదైందంది. ఇక అమెరికాలో 2025లో దేశంలో 9 సెకన్లకు ఒక జననం, 9.4 సెకన్లకో మరణం నమోదు కావొచ్చని అంచనా వేసింది.