Wednesday, February 11, 2026
Homeఇంటర్నేషనల్Pakistan: పాకిస్థాన్‌ను వదిలి వెళ్తున్న ఇంజినీర్లు, డాక్టర్లు.. నెట్టింట్లో వ్యంగ్యాస్త్రాలు.!

Pakistan: పాకిస్థాన్‌ను వదిలి వెళ్తున్న ఇంజినీర్లు, డాక్టర్లు.. నెట్టింట్లో వ్యంగ్యాస్త్రాలు.!

Doctors and Engineers Leave Pakistan: అధ్వాన్నంగా మారుతున్న ఆర్థిక పరిస్థితులు, రాజకీయ అస్థిరత కారణంగా గత రెండేళ్లుగా వైద్యులు, ఇంజనీర్లతో సహా వేలాది మంది నైపుణ్యం కలిగిన నిపుణులు పాకిస్తాన్‌ను వదలివెళ్లారు. ఇప్పటివరకూ ఏకంగా 5,000 మందికి పైగా డాక్టర్లు, 11,000 మంది ఇంజనీర్లు, 13,000 మంది అకౌంటెంట్లను కోల్పోయిందని ప్రభుత్వ డేటా ద్వారా వెల్లడైందని పాకిస్తాన్ ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదికలో పేర్కొంది. 

- Advertisement -

శత్రు దేశంలో ఆర్థిక అనిశ్చితి నెలకొంది. అక్కడి దారుణమైన ఆర్థిక పరిస్థితులు, రాజకీయ అస్థిరత.. దేశం వృత్తి నిపుణులను కోల్పోయేలా చేస్తోంది. బ్యూరో ఆఫ్ ఎమిగ్రేషన్ అండ్ ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ విడుదల చేసిన ఈ గణాంకాలు ప్రభుత్వంపై విమర్శలను గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ పెద్ద ఎత్తున వలసలను మేధో మత్తుగా కాకుండా “మేధో లాభం”గా అభివర్ణించిన తర్వాత ఈ పరిణామాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి.

Also Read: https://teluguprabha.net/top-stories/high-command-considering-changing-the-telangana-congress-in-charge/

ప్రభుత్వ డేటా ప్రకారం, 2024లో 7,27,381 మంది పాకిస్తానీలు అధికారికంగా విదేశీ ఉపాధి కోసం నమోదు చేసుకున్నట్లు వెల్లడైంది. 2025లో, నవంబర్ చివరి నాటికి మరో 6,87,246 మంది విదేశాలకు వలస వెళ్లారు. ఈ వలసలు పని కోసం గల్ఫ్‌కు వెళ్లే కార్మికులకు లేదా దేశం విడిచి వెళ్ళడానికి ప్రయత్నించే “ప్రొఫెషనల్ బిచ్చగాళ్ళు” అని పిలవబడే వారికి మాత్రమే పరిమితం కాకపోవడం ఆందోళన కలిగించే విషయం.

పాక్‌లో ఆరోగ్య సంరక్షణ రంగం అత్యంత తీవ్రంగా దెబ్బతినగా.. 2011- 2024 మధ్య నర్సుల వలసలు 2,144 శాతం పెరిగింది. ఈ సంవత్సరం కూడా అదే ధోరణి కొనసాగిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో వలసల సంఖ్యలు, ముఖ్యంగా వైద్యులు, ఇంజనీర్లు వెళ్లిపోతున్న వైనం.. ఆన్‌లైన్‌లో చర్చకు దారితీస్తోంది. 

అసిమ్ మునీర్ ‘బ్రెయిన్ గెయిన్‌’ వ్యాఖ్య

ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా మంది.. ఆగష్టులో అసిమ్ మునీర్ అమెరికాలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నారు. అక్కడ ఆయన విదేశీ వలసలను “బ్రెయిన్‌ గెయిన్‌”గా పేర్కొన్నారు.

Also Read: https://teluguprabha.net/top-stories/telangana-federation-of-farmers-has-issued-legal-notices-to-kcr/

కాగా, “గత 24 నెలల్లో పాక్ 5000 మంది వైద్యులు, 11000 మంది ఇంజనీర్లు, 13000 మంది అకౌంటెంట్లను కోల్పోయింది. పాక్ 4వ అతిపెద్ద ఫ్రీలాన్సింగ్ హబ్. ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు 1.62 బిలియన్‌ డాలర్ల నష్టానికి కారణమయ్యాయి. 2.37 మిలియన్ల ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాలను ప్రమాదంలో పడేసింది.” అని పాక్ మాజీ సెనేటర్ ముస్తఫా నవాజ్ ఖోఖర్ ‘X’లో చర్చించడం వైరల్‌గా మారింది. దీనిపై పాకిస్థానీ నెటిజన్లు ఆయనకు మద్దతుగా స్పందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News