Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Donald Trump : భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపింది నేనే: నోబెల్ బహుమతికి అర్హుడిని

Donald Trump : భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపింది నేనే: నోబెల్ బహుమతికి అర్హుడిని

India-Pakistan War :అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటనలతో వార్తల్లో నిలిచారు. ఇటీవల అమెరికన్ కార్నర్‌స్టోన్ ఇన్‌స్టిట్యూట్ ఫౌండర్స్ డిన్నర్‌లో పాల్గొన్న ఆయన, భారత్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన యుద్ధాన్ని తాను ఆపినట్లు, ఈ ఘనతకు తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ఈ వివాదాన్ని వాణిజ్యాన్ని ఆయుధంగా ఉపయోగించి పరిష్కరించానని ఆయన తెలిపారు.

- Advertisement -

“భారత్, పాకిస్థాన్ నేతలంటే నాకు గౌరవం ఉంది. కానీ, ‘మీరు యుద్ధానికి దిగితే, మేం ఎలాంటి వాణిజ్యం చేయబోం’ అని నేను వారికి స్పష్టంగా చెప్పాను. వారి వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి, అందుకే వారు యుద్ధాన్ని ఆపేశారు” అని ట్రంప్ వివరించారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. కేవలం భారత్-పాకిస్థాన్ మధ్యే కాకుండా, థాయ్‌లాండ్-కంబోడియా, అర్మేనియా-అజర్‌బైజాన్ సహా మొత్తం ఏడు యుద్ధాలను తాను ఆపినట్లు ట్రంప్ పేర్కొన్నారు. వాటిలో 60 శాతం వాణిజ్య సంబంధాల ద్వారానే సాధ్యమయ్యాయని ఆయన స్పష్టం చేశారు.

తన హయాంలో అమెరికాకు ప్రపంచ వేదికపై ఎన్నడూ లేనంత గౌరవం లభించిందని ట్రంప్ అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే నోబెల్ బహుమతి వస్తుందని కొందరు తనతో అన్నారని చెబుతూ, “మరి నేను ఆపిన ఈ ఏడు యుద్ధాల సంగతేంటి? నాకు ప్రతిదానికీ ఒక నోబెల్ బహుమతి రావాలి కదా?” అని చమత్కరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తనకు మంచి సంబంధాలున్నాయని, రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించడం తనకు సులభమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అది కూడా పరిష్కరించి తీరతానని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad