HomeTop StoriesDonald Trump: అతడి వల్లే అమెరికాకు ఇన్ని సమస్యలు.. మాజీ అధ్యక్షుడిపై నోరు పారేసుకున్న ట్రంప్‌..!

Donald Trump: అతడి వల్లే అమెరికాకు ఇన్ని సమస్యలు.. మాజీ అధ్యక్షుడిపై నోరు పారేసుకున్న ట్రంప్‌..!

Donald Trump comments on Iran Nuclear deal: అమెరికా చేసుకున్న అత్యంత చెత్త ఒప్పందాల్లో ఇరాన్‌ అణు ఒప్పందం ఒకటని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం గత ప్రెసిడెంట్‌ ఒబామా, ఆయన యంత్రాంగంలోని అనుభవం లేని అధికారులు ప్రతిపాదించి, అమల్లోకి తెచ్చారని విమర్శించారు. ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలకు ఈ డీల్‌ వీలు కల్పించిందన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా వల్లే నేడు అమెరికాకు ఇన్ని సమస్యలొస్తున్నాయని ఫైరయ్యారు. అయితే, తమ హయాంలో ఇరాన్‌తో జరుపుతున్న ఒప్పందం విషయంలో అలాంటి తప్పిదం జరగదని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య చర్చలు క్రమబద్ధంగా, నిర్మాణాత్మకంగా సాగుతున్నాయన్నారు. ఒప్పందం విషయంలో తొందరపడొద్దని, అమెరికా ప్రయోజనాలే ముఖ్యమని తమ ప్రతినిధులకు తాను స్పష్టంగా చెప్పినట్లు ట్రంప్‌ వెల్లడించారు. ఒప్పందం కుదిరి, అంగీకరించి, ఇరుపక్షాలు సంతకాలు చేసే వరకు హర్మూజ్‌ దిగ్బంధనం పూర్తి స్థాయిలో అమల్లో ఉంటుందన్నారు.

- Advertisement -

Also Read: KTR fires: మోదీ ఒత్తిడికి తలొగ్గి మోటార్లకు మీటర్లు బిగించే కుట్ర.. రేవంత్ సర్కారుపై కేటీఆర్ ఫైర్

ఆలస్యమైనా అన్నీ చర్చించాకే ఇరాన్‌తో ఒప్పందం..

కాస్త ఆలస్యమైనా అన్ని విషయాలు చర్చించిన తర్వాతే ఇరుపక్షాలు ఒప్పందం చేసుకోవాల్సి ఉందని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇరాన్‌తో తమ బంధం మరింత దృఢంగా మారుతోందన్నారు. అయినప్పటికీ, వారు అణ్వాయుధాలని అభివృద్ధి చేసుకోలేరని లేదా సమకూర్చుకోలేరనే విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు తమకు మద్దతు తెలిపిన, సహకారం అందించిన పశ్చిమాసియా దేశాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ట్రూత్‌ సోషల్‌ వేదికగా ట్రంప్‌ వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News