HomeTop StoriesDonald Trump: అదేం ఫైనల్‌ కాదు.. నచ్చకపోతే మళ్లీ దాడులు చేస్తాం.. బాంబు పేల్చిన ట్రంప్‌

Donald Trump: అదేం ఫైనల్‌ కాదు.. నచ్చకపోతే మళ్లీ దాడులు చేస్తాం.. బాంబు పేల్చిన ట్రంప్‌

Donald Trump hot comments on Iran war: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఇరాన్‌ యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో తాము చేసుకోబోయేది కేవలం అవగాహన ఒప్పందమేనని అది ఫైనల్‌ కాదని స్పష్టం చేశారు. ఒకవేళ, ఒప్పందంలోని అంశాలు తనకు నచ్చకపోతే, ఇరాన్‌ తీరు సరిగ్గా లేకపోతే.. ఆ దేశంపై మళ్లీ యుద్ధం ప్రారంభిస్తామని, బాంబులతో విరుచుకుపడతామని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. జీ7 సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న ట్రంప్‌ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు రోజుల్లో అవగాహన ఒప్పందంపై ఇరుదేశాలూ సంతకాలు చేయనున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇరుదేశాల మధ్య ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

- Advertisement -

Also Read: AP Inter supplementary: విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌.. రేపే ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు

ఇరాన్‌లో పెట్టుబడి పెట్టడం లేదు..

అమెరికా-ఇరాన్ ఒప్పందంలో భాగంగా పునర్నిర్మాణ నిధుల కింద టెహ్రాన్‌కు 300 బిలియన్ డాలర్లు సమకూర్చే అంశం పరిశీలనలో ఉందని వస్తున్న వార్తలు అవాస్తవమని ట్రంప్ వెల్లడించారు. తాము ఒక్క పైసా కూడా వెచ్చించడం లేదని కుండ బద్దలు కొట్టారు. మేం ఇరాన్‌లో పెట్టుబడి పెట్టడం లేదని, మా దగ్గర అటువంటి ఫండ్‌ ఏదీ లేదని తేల్చి చెప్పారు. ఇరాన్‌లో పెట్టుబడులు పెట్టాలని గల్ఫ్ దేశాలనూ కోరడం లేదన్నారు. ఒకవేళ, వారు అమెరికాలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే, యుద్ధం విరమించే విషయంలో ఇరాన్‌ ధోరణిపై కొంత అవగాహన వచ్చే వరకు తాము పెట్టుబడుల జోలికి వెళ్లేది లేదన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News