Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Donald Trump: ట్రంప్‌ మరో కొత్త రూల్‌.. ఇకపై, అమెరికాలోకి ఎంట్రీ, ఎగ్జిట్‌ సమయంలో ఫోటోలు..!

Donald Trump: ట్రంప్‌ మరో కొత్త రూల్‌.. ఇకపై, అమెరికాలోకి ఎంట్రీ, ఎగ్జిట్‌ సమయంలో ఫోటోలు..!

Donald Trump New Rule for Non Immigrants While entry and Exit: వలసదారులను నియంత్రించడంలో భాగంగా రోజుకో కొత్త రూల్‌ తీసుకొస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. మరో కొత్త రూల్‌ ప్రకటించారు. ఈ కొత్త రూల్‌ ప్రకారం, ఇకపై అమెరికాయేతర పౌరులు దేశం వీడే సమయంలో లేక దేశంలోకి అడుగుపెట్టే సమయంలో అధికారులు వారి ఫొటోలు తీయనున్నారు. గ్రీన్‌కార్డుదారులతో పాటు వలసదారులందరికీ ఈ కొత్త నిబంధన వర్తించనుంది. ఫెడరల్ రిజిస్టర్‌లో తాజాగా ఈ నిబంధనలను ప్రచురించారు. వాటి ఆధారంగా ఏ మార్గంలో అయినా దేశాన్ని వీడే, దేశంలోకి అడుగుపెట్టే వారి ఫొటోలు, డేటా సేకరణను యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) పెంచనుంది. ఫేక్ ట్రావెల్ పేపర్లను గుర్తించేందుకు, జాతీయ భద్రతను బలోపేతం చేసేందుకు డిసెంబర్ 26 నుంచి ఈ నిబంధనలను అమలు చేయనుంది. వివిధ మార్గాల్లో ఇమ్మిగ్రేషన్ చట్టాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే వారిని, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉంటున్నవారిని గుర్తించేందుకు వీలవుతుందని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. ఇక, 2021లోనే ఈ కొత్త నియంత్రణలు ప్రతిపాదించగా.. ఇప్పుడు పూర్తిస్థాయిలో సాంకేతికత ఉపయోగించి అక్రమవలసదారులకు చెక్ పెట్టనున్నారు.

- Advertisement -

హెచ్‌1బీ వీసా రుసుము పెంపు..

కాగా, ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌’ అంటూ జాతీయవాదాన్ని బలంగా వినిపిస్తోన్న ట్రంప్.. హెచ్‌-1బీ వీసాలకు సంబంధించి పలు నిబంధనలు విధించారు. వాటి వార్షిక రుసుమును ఒకేసారి లక్ష డాలర్లకు పెంచేసి సంచలనం సృష్టించారు. అనంతరం పలు సవరణలు చేశారు. ఈ వీసా వ్యవస్థను సరిదిద్దడానికి, అమెరికన్లకు ప్రాధాన్యం ఇవ్వడానికి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ లక్ష డాలర్ల ఫీజు నిర్ణయం తీసుకున్నారని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లివిట్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, ట్రంప్‌ ఇటీవలే మరో కొత్త నిబంధన తీసుకొచ్చారు. ఈ కొత్త నిబంధన ప్రకారం, ఇక నుంచి ఎవరైనా సరే నాన్- ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూకి తమ సొంత దేశం లేదా చట్టబద్ధంగా నివాసం ఉంటున్న దేశంలోనే అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ ఏ దేశంలోనైనా అపాయింట్‌మెంట్ తీసుకునే అవకాశం రద్దయ్యింది. ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని అమెరికా ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. మామూలుగా పర్యాటకం, వ్యాపారం కోసం బీ 1, బీ 2 వీసాలకు చాలా మంది దరఖాస్తు చేసుకుంటారు. తాజా నిబంధన కారణంగా భారతీయులైన వ్యాపారులు, పర్యటకులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. వీళ్లు బీ1 (B1 Visa) (వ్యాపార), బీ2 (B2 Visa)(టూరిస్ట్‌) వీసాలను స్వల్ప వ్యవధిలో పొందడం సాధ్యం కాకపోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad