Homeఇంటర్నేషనల్Trump: ఒప్పందం కుదరకపోతే యుద్ధమే.. ఇరాన్‌కు ట్రంప్‌ వార్నింగ్‌

Trump: ఒప్పందం కుదరకపోతే యుద్ధమే.. ఇరాన్‌కు ట్రంప్‌ వార్నింగ్‌

Donald Trump: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో చర్చలు సఫలం కాకపోతే యుద్ధం తప్పదని, తాము ఇప్పటికే ఆయుధాలను సిద్ధం చేసుకున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి కోసం తాము ప్రతిపాదించే ‘డీల్’ను అంగీకరించాలని, లేనిపక్షంలో వినాశకర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

- Advertisement -

తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హర్మూజ్‌ దిగ్బంధంతో ఇప్పటికే విజయం సాధించామని, అద్భుతమైన డీల్‌తో చర్చలకు ముగింపు పలుకుతామని అన్నారు. ఇరాన్‌తో డీల్ కుదరకపోతే మేము మరోసారి యుద్ధానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గత కాల్పుల విరమణ సమయంలో మేము మా శక్తిని మరింతగా కూడగట్టుకున్నామని, ఇప్పటికే అన్ని రకాల అత్యాధునిక ఆయుధాలను యుద్ధం కోసం సిద్ధం చేశామని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇరాన్ పోర్టుల దిగ్బంధనం అమెరికా సాధించిన గొప్ప విజయమన్నారు.

Also Read: Allu Arjun: ఢిల్లీ హైకోర్టులో అల్లు అర్జున్‌కి ఊరట

కేవలం కాల్పుల విరమణతో సమస్య పరిష్కారం కాదని, పటిష్టమైన ఒప్పందం లేకుండా దీనిని కొనసాగించలేమని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ కోసం తాము ఒక అద్భుతమైన డీల్ సిద్ధం చేస్తున్నామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం వల్ల శాంతి, భద్రత, రక్షణ ఏర్పడతాయన్నారు. తాను రూపొందించిన ఈ ఒప్పందాన్ని చూసి యావత్ ప్రపంచమే గర్వపడుతుంది ధీమా వ్యక్తం చేశారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా ముఖ్యంగా ఇంధన మార్కెట్లో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యుద్ధంలో అమెరికా తదుపరి నిర్ణయం ఏంటన్నది ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News