Thursday, January 9, 2025
Homeఇంటర్నేషనల్అమెరికాలో కెనడా విలీనం.. కొత్త మ్యాప్ షేర్ చేసిన ట్రంప్..!

అమెరికాలో కెనడా విలీనం.. కొత్త మ్యాప్ షేర్ చేసిన ట్రంప్..!

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. మరికొన్ని రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2024 నవంబర్ 5వ తేదీన జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ నెల 20వ తేదీన అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

- Advertisement -

ఇదిలా ఉండగా.. తాజాగా డొనాల్డ్ ట్రంప్ కొత్త వివాదానికి తెర తీశారు. అమెరికా పొరుగు దేశమైన కెనడాను విలీనం చేసుకోవాలని చూస్తున్నారు. దీనికి సంబంధించిన రెండు కొత్త మ్యాప్‌లను కూడా తన సొంత, అధికారిక ట్రూత్ సోషల్ ప్లాట్ ఫామ్‌పై పోస్ట్ చేశారు. అమెరికా, కెనడా దేశాలపై జాతీయ జెండా పరిధిలోకి తీసుకొచ్చారు. Oh Canada! అనే క్యాప్షన్ దానికి జత చేశారు. ఈ మ్యాప్‌ను పోస్ట్ చేయడానికి కొన్ని గంటల ముందే.. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను తెర మీదికి తీసుకొచ్చారాయన. తన సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కెనడాను 51వ రాష్ట్రంగా గుర్తిస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.. ఆ తరువాతే ఈ కొత్త మ్యాప్‌ను పోస్ట్ చేశారు. కెనడాను విలీనం చేసుకోవడానికి ఎకనామిక్ ఫోర్స్ను ప్రయోగిస్తాననీ వ్యాఖ్యానించారు.

ఫ్లోరిడాలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని కెనడాను విలీనం చేసుకోవాలని భావిస్తోన్నానని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. కెనడా భద్రత దృష్ట్యా అమెరికాలో విలీనం కావడమే మంచిదని పేర్కొన్నారు. డిపెండెన్సీ.. కెనడా రక్షణ శాఖ పరిధి చాలా పరిమితంగా ఉంటోందని, ఎక్కువగా తమ దేశ సైనిక శక్తి మీద ఆధారపడుతోందని డొనాల్డ్ ట్రంప్ గుర్తు చేశారు. దీనికోసం ఆ దేశం తమకు భారీ మొత్తాన్ని చెల్లిస్తోందని, ఇది సరికాదని ట్రంప్ చెప్పారు.

అయితే తాము సైనిక చర్య ద్వారా కెనడాను విలీనం చేసుకోవాలని అనుకోవట్లేదని ట్రంప్ తెలిపారు. ఎకనమిక్ ఫోర్స్ ద్వారా కెనడాను విలీనం చేసుకోవాలనుకుంటోన్నానని, దీనివల్ల కెనడా ఆర్థికంగా ఎంతో శక్తిమంతమౌతుందని చెప్పారు. అమెరికాను మళ్లీ స్వర్ణయుగంలోకి తీసుకెళ్తామని ట్రంప్ పేర్కొన్నారు. కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా గుర్తించడాన్ని రెండు దేశాల ప్రజలు స్వాగతిస్తారని డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు. ఇక కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడోతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, 2017- 2021 మధ్యకాలంలో తమ రెండు దేశాల మధ్య దౌత్య, వాణిజ్య, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు అత్యున్నత స్థాయిలో కొనసాగాయని ట్రంప్ వివరించారు. ఒక వేళ ఇదే జరిగితే.. కెనడా అమెరికాలో కలిసి పోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News