Sunday, February 8, 2026
Homeఇంటర్నేషనల్Trump: ఆందోళనలు కొనసాగించండి- ఇరాన్‌లో నిరసనకారులకు ట్రంప్ పిలుపు

Trump: ఆందోళనలు కొనసాగించండి- ఇరాన్‌లో నిరసనకారులకు ట్రంప్ పిలుపు

Trump Supports to Iran Protestors: ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భగ్గుమన్న ఆందోళనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆందోళనకారులు తమ నిరసనలు కొనసాగించాలని, త్వరలోనే సహాయం అందుతుందని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై ట్రంప్‌ 25శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. దీంతో ఇరాన్‌ విషయంలో అమెరికా తీరుపై రష్యా, చైనా దేశాధినేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

- Advertisement -

ఇరాన్‌ ప్రభుత్వంపై గత రెండు వారాలుగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనల్లో సుమారు 2,000 మంది వరకూ మరణించినట్లు ఇరాన్‌ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది. ఈ క్రమంలో ఈ నిరసనలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మద్దతు ప్రకటిస్తూ.. ఆందోళనలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోవాలని.. త్వరలోనే మీకు సహాయం అందుతుందని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు. 

Also Read: https://teluguprabha.net/telangana-news/indiramma-housing-scam-hyderabad-collectorates/

ఇరాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం కారణంగా ఈ నిరసనలు మొదలయ్యాయి. ఈ ఆందోళనలు ప్రస్తుతం అక్కడి మతపరమైన పాలనకు పెద్ద సవాలుగా మారగా.. ఆందోళనల్లో సుమారు 2,000 మంది మరణించారని ఇరాన్‌ ప్రభుత్వ అధికారి అంగీకరించారు. ఈ విధ్వంసానికి ‘ఉగ్రవాదులే’ కారణమని, మృతుల్లో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని ఆరోపణలు చేశారు. 

ఈ క్రమంలో నిరసనకారులకు మద్దతు తెలుపుతూ.. ఇరాన్‌ దేశ అధికారులతో తలపెట్టిన అన్ని సమావేశాలను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన చేశారు. నిరసనకారులపై హత్యలు ఆగే వరకు ఇరాన్ ప్రభుత్వంతో చర్చలు జరపబోనని.. ఇరాన్‌తో వ్యాపారం చేసే ఏ దేశంపై అయినా 25 శాతం దిగుమతి సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. కాగా, ఇరాన్ నుంచి చైనా, భారత్, టర్కీ, యూఏఈ వంటి దేశాలు ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాయి. దీంతో రష్యా, చైనా.. అమెరికా తీరును వ్యతిరేకిస్తున్నాయి. 

Also Read: https://teluguprabha.net/international-news/world-economic-forum-davos-2026-trump-zelenskyy-agenda/

అమెరికా చర్యలను తీవ్రంగా ఖండించిన రష్యా.. ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై మండిపడింది. ఇరాన్‌పై సైనిక దాడులు మధ్యప్రాచ్యానికి, ప్రపంచ భద్రతకు పెను విపత్తు అని పేర్కొంది. చైనా సైతం ట్రంప్‌ తీరును వ్యతిరేకించింది.  

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News