Trump’s Migration Bombshell For ‘3rd World Countries’: అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. వైట్‌హౌస్ సమీపంలో ఆఫ్ఘన్ జాతీయుడు కాల్పులు జరపడం, ఒక సైనికురాలు మరణించిన కొన్ని రోజుల తర్వాత ఆయన కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. మూడో ప్రపంచ దేశాలు (Third World Countries) అన్నింటి నుండి వలసలు (Migration) రాకుండా శాశ్వతంగా నిలిపివేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. “అమెరికా వ్యవస్థ పూర్తిగా కోలుకోవడానికి” ఈ చర్య తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం ఉద్యోగాలు, విద్య, ఆశ్రయం కోసం అమెరికాకు తరలి వెళ్లాలనుకునే లక్షలాది మంది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ: Feral Cats న్యూజిలాండ్ ‘ఫెరల్ క్యాట్స్’ పై యుద్ధం: 25 లక్షల ‘రాక్షస హంతకుల’ నిర్మూలనే లక్ష్యం!
సంచలన వలస విధాన ప్రకటన
ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ కఠిన నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికా సాంకేతికంగా పురోగమించినప్పటికీ, ప్రస్తుత వలస విధానం దేశాంతర అభివృద్ధిని, జీవన పరిస్థితులను దెబ్బతీసిందని ఆయన విమర్శించారు.
తాను అధికారంలోకి వస్తే చేపట్టే చర్యలను ట్రంప్ వివరంగా వెల్లడించారు:
-
శాశ్వత విరామం: మూడో ప్రపంచ దేశాల నుండి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తాను.
-
అక్రమ ప్రవేశాల రద్దు: జో బైడెన్ ఆమోదించిన లక్షలాది అక్రమ ప్రవేశాలను రద్దు చేస్తాను.
-
ఉపయోగం లేని వారి తొలగింపు: దేశానికి ఉపయోగపడని వారిని లేదా దేశాన్ని ప్రేమించలేని వారిని తొలగిస్తాను.
-
ప్రయోజనాల రద్దు: విదేశీయులకు ఇచ్చే అన్ని సమాఖ్య ప్రయోజనాలు, సబ్సిడీలు నిలిపివేస్తాను.
-
పౌరసత్వ రద్దు: దేశీయ శాంతిని దెబ్బతీసే వలసదారుల పౌరసత్వాన్ని రద్దు చేస్తాను.
-
దేశ బహిష్కరణ: ప్రభుత్వానికి భారం, భద్రతకు ప్రమాదం, పాశ్చాత్య నాగరికతకు సరిపడని విదేశీయులను దేశం నుండి బహిష్కరిస్తాను.
ఈ విధానాల ద్వారా అక్రమ జనాభాను భారీగా తగ్గిస్తామని, “రివర్స్ మైగ్రేషన్” మాత్రమే ఈ సమస్యకు పూర్తి పరిష్కారం అని ట్రంప్ నొక్కి చెప్పారు.
వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు: మరణించిన సైనికురాలు
ట్రంప్ ఈ భారీ ప్రకటన చేయడానికి వైట్‌హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల సంఘటన తక్షణ కారణంగా నిలిచింది. రెండ్రోజుల క్రితం నేషనల్ గార్డ్ ట్రూపర్స్ సారా బెక్ స్ట్రోమ్ (20), ఆండ్రూ వోల్ఫ్ (24)పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పశ్చిమ వర్జీనియాకు చెందిన సారా బెక్ స్ట్రోమ్ దుర్మరణం చెందింది. గాయపడిన వోల్ఫ్ పరిస్థితి విషమంగా ఉంది.
ఈ కాల్పులు జరిపిన వ్యక్తి రహమానుల్లా లకన్వాల్ అని అధికారులు గుర్తించారు. ఇతను 29 ఏళ్ల ఆఫ్ఘన్ జాతీయుడు. 2021లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుండి వైదొలగిన తర్వాత ఇక్కడికి వచ్చాడు. ఈ దాడి వెనుక ఉద్దేశం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన జరిగిన వెంటనే, US సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఆఫ్ఘన్ జాతీయుల వలస అభ్యర్థనల ప్రాసెసింగ్‌ను నిలిపివేసింది.
వలసదారులపై ట్రంప్ తీవ్ర విమర్శలు
ట్రంప్ తన థాంక్స్ గివింగ్ సందేశంలో కూడా వలసదారుల అంశాన్ని లేవనెత్తారు. అమెరికాలో విదేశీయుల జనాభా 53 మిలియన్లకు చేరిందని, వారిలో ఎక్కువ మంది విఫలమైన దేశాల నుండి, జైళ్ల నుండి, గ్యాంగ్‌ల నుండి వచ్చినవారని ఆయన ఆరోపించారు.
“గ్రీన్ కార్డ్ ఉన్న వలసదారులకు ఏటా $50,000 వరకు ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయి. శరణార్థుల భారం అమెరికాలో సామాజిక అల్లకల్లోలానికి, నేరాలకు, ఆసుపత్రులు కిక్కిరిసిపోవడానికి ప్రధాన కారణం,” అని ట్రంప్ స్పష్టం చేశారు. సోమాలియా నుండి వచ్చిన లక్షలాది మంది శరణార్థులు ఒకప్పుడు గొప్ప రాష్ట్రంగా ఉన్న మిన్నెసోటాను పూర్తిగా స్వాధీనం చేసుకుంటున్నారని ఆయన ఉదాహరణ ఇచ్చారు.
ALSO READ: Thailand Floods: వరద గుప్పిట్లో థాయ్‌లాండ్.. 80 దాటిన మృతుల సంఖ్య

